జిమ్‌లో పాటించాల్సిన రూల్స్..

జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయటం మీదే దృష్టి పెడతాం. కానీ అందుకోసం వేసుకోవలసిన దుస్తులు, షూ గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వ్యాయామం సౌకర్యంగా ఉండాలన్నా, వ్యాయామం వల్ల శారీరక సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నా జిమ్ డ్రెస్సింగ్‌లో కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో చూద్దాం… షూ : సింపుల్ వర్కవుట్‌కి ఉపయోగపడే బేసిక్ రన్నింగ్ షూస్ వేసుకోవాలి. వ్యాయామం చేసే సమయంలో కాలి కీళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే మేలు రకం స్పోర్ట్ షూ వేసుకోవటం తప్పనిసరి. చమట […] The post జిమ్‌లో పాటించాల్సిన రూల్స్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయటం మీదే దృష్టి పెడతాం. కానీ అందుకోసం వేసుకోవలసిన దుస్తులు, షూ గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వ్యాయామం సౌకర్యంగా ఉండాలన్నా, వ్యాయామం వల్ల శారీరక సమస్యలు తలెత్తకుండా ఉండాలన్నా జిమ్ డ్రెస్సింగ్‌లో కొన్ని నియమాలు పాటించాలి.

అవేంటో చూద్దాం…
షూ : సింపుల్ వర్కవుట్‌కి ఉపయోగపడే బేసిక్ రన్నింగ్ షూస్ వేసుకోవాలి. వ్యాయామం చేసే సమయంలో కాలి కీళ్లు దెబ్బతినకుండా ఉండాలంటే మేలు రకం స్పోర్ట్ షూ వేసుకోవటం తప్పనిసరి.
చమట పీల్చుకునే టీషర్ట్ : ట్రైనింగ్ టీషర్ట్ ఎంచుకోవాలి. వ్యాయామం చేయటం వల్ల చమట పట్టి, ఆ చమటతో టీషర్ట్ తడిసిపోతే… అలాగే వర్కవుట్ చేయటం మనతోపాటు పక్కనున్నవాళ్లకూ అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి స్వెట్ రెసిస్టెంట్ మెటీరియల్‌తో తయారైన టీషర్ట్‌నే వేసుకోవాలి.
ఫిట్‌నెస్ ట్రాకర్ : ఫిట్‌నెస్ గురించి అప్ టు డేట్ ఉండాలంటే ఫిట్‌నెస్ ట్రాకర్ ధరించాలి. గుండె కొట్టుకునే వేగం, ఖర్చయ్యే కెలోరీల లెక్క తెలియటం కోసం జిమ్‌కి వెళ్లేటప్పుడు ఫిట్‌నెస్ ట్రాకర్‌ని వెంట తీసుకెళ్లండి.
తాజా సాక్స్ : వారం మొత్తానికి సరిపడా సాక్స్ ఉంచుకోవాలి. రోజూ సాక్స్ మారుస్తూ ఉంటే అవి దుర్వాసన రాకుండా ఉంటాయి. పాదాలకు ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉంటుంది.

Gym Rules Everyone Should Following

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జిమ్‌లో పాటించాల్సిన రూల్స్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: