కాకతీయుల కళాసంపదకు సజీవసాక్ష్యం…రామప్ప దేవాలయం

  జాతీయ స్థాయిలోనే అత్యద్భుత శిల్పకళా నిలయం రామప్ప దేవాలయం. ఉమ్మడి జయశంకర్ జిల్లాలో భాగమైన ములుగు జిల్లా వెంకటాపురం (ఎం)మండలం పాలంపేటలో రామప్ప అనే శిల్పి పేరుతో ఈ ఆలయాన్ని పిలుచుకుంటారు. ఆలయ గోపుర నిర్మాణంలో 0.8, 0.9 సాంద్రత (నీటిలో బెండులా తేలే ) ఎక్కడా లేని ఇటుకను వాడడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఆలయాన్ని ఇసుకతో పునాది చేసి సాండ్‌బాక్స్ టెక్నాలజీతో నిర్మాణంలో భవిష్యత్తులో నష్టం జరుగకుండా 10-,12 అంగుళాల భీములతో పాటు డోలమైట్, […] The post కాకతీయుల కళాసంపదకు సజీవసాక్ష్యం… రామప్ప దేవాలయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జాతీయ స్థాయిలోనే అత్యద్భుత శిల్పకళా నిలయం రామప్ప దేవాలయం. ఉమ్మడి జయశంకర్ జిల్లాలో భాగమైన ములుగు జిల్లా వెంకటాపురం (ఎం)మండలం పాలంపేటలో రామప్ప అనే శిల్పి పేరుతో ఈ ఆలయాన్ని పిలుచుకుంటారు.

ఆలయ గోపుర నిర్మాణంలో 0.8, 0.9 సాంద్రత (నీటిలో బెండులా తేలే ) ఎక్కడా లేని ఇటుకను వాడడం ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఆలయాన్ని ఇసుకతో పునాది చేసి సాండ్‌బాక్స్ టెక్నాలజీతో నిర్మాణంలో భవిష్యత్తులో నష్టం జరుగకుండా 10-,12 అంగుళాల భీములతో పాటు డోలమైట్, బ్లాక్ గ్రానైట్ వినియోగించారు. ఒకే రాతిపై అలరించే మూడు రంగులతో మెరిసే చెక్కడాలు అరుదైన రంగురాళ్ళు అమర్చడం మరో ఆకర్షణ. గర్భగుడిలో రామలింగేశ్వరుడు ఎప్పుడూ వెలుగుతూ తేజస్సుతో ఉండటం, ఆకట్టుకునే నందీశ్వరుని సృష్టి శిల్పుల పనితనానికి నిదర్శనం. మీటితే సరిగమలు పాడే రాళ్ళు, ఆలయ పైకప్పు పై రామాయణ, భారత, భాగవత, శైవ పురాణాల శిల్పాలు సందర్శకులను అలరిస్తాయి. ఆకర్షించే నాగిని, రాగిణి శిల్పాలు అద్భుతంగా ఉంటాయి.

806 ఏళ్ళ నిర్మాణం:

కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గజసేనాని రేచర్ల రుద్రారెడ్డి అన్యమ్మ దంపతులు ఈ ఆలయాన్ని శాలివాహక శకం 1173 శ్రీముఖనామ సంవత్సరం మధుమాసం, వసంత శుక్ల పంచమి శుభమూహుర్తాన శంకుస్థాపన చేశారు. అష్టమి, భానువారం, పుష్యమి నక్షత్రం 1213 మార్చి 31 వరకు 14 ఎకరాల విస్తీర్ణంలో పది ఉపాలయాలతో కలిసి ప్రధాన ఆలయాన్ని నిర్మాణం చేసి ఇప్పటికి 806 ఏళ్ళు పూర్తయ్యాయి. కాకతీయ, విజయనగర, చాళుక్య రాజ్యాలకు చెందిన భాషా సంస్కృతి సంప్రదాయాలను సృశిస్తూ 40 సంవత్సరాలపాటు శిల్పులు శ్రమించి ఈ ఆలయాన్ని సృష్టించారు.

గుర్తింపునకు అర్హతలు:

యునెస్కో హోదాకు చేరువలో రామప్ప దేవాలయం ఉంది. నిర్మాణం చుట్టూ 300 మీటర్ల మేర ఎలాంటి అక్రమ కట్టడాలకు తావు లేకుండా పోవడమే ఈ ఆలయం ఆ సంస్థ గుర్తింపునకు తగిన అర్హమైంది. ఇంటాక్ కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సంయుక్తంగా ఈ ఆలయ ప్రత్యేకతలతో రూపొందించిన డోజియర్‌ను 2019లో ప్రభుత్వం యునెస్కో పోటీకి పంపింది. థాయిలాండ్‌కు చెందిన యూనెస్కో ప్రతినిధి డా॥వాసు హాషియానందన్ పర్యవేక్షణలో ఆలయ నిర్మాణాన్ని పరిశీలించి ప్రశంసించడం విశేషం.

తాళ్ళపల్లి వెంకట సమ్మయ్య
జయశంకర్ భూపాలపల్లి
జిల్లా స్టాఫర్

Ramappa Temple Story in Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాకతీయుల కళాసంపదకు సజీవసాక్ష్యం… రామప్ప దేవాలయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.