కుటుంబ కథా చిత్రం ప్రారంభం

నితిన్, కీర్తి సురేష్‌ల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం ప్రారంభమైంది. తొలిప్రేమ, మజ్ను వంటి ప్రేమ కథాచిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు నితిన్, కీర్తిసురేష్‌లపై త్రివిక్రమ్ క్లాప్‌నిచ్చారు. స్క్రిప్ట్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)లు దర్శకుడు వెంకీ అట్లూరికి అందజేశారు. […] The post కుటుంబ కథా చిత్రం ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నితిన్, కీర్తి సురేష్‌ల కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘రంగ్ దే’ చిత్రం ప్రారంభమైంది. తొలిప్రేమ, మజ్ను వంటి ప్రేమ కథాచిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లు నితిన్, కీర్తిసురేష్‌లపై త్రివిక్రమ్ క్లాప్‌నిచ్చారు. స్క్రిప్ట్‌ను ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)లు దర్శకుడు వెంకీ అట్లూరికి అందజేశారు. ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేశారు.

ఈ కార్యక్రమంలో జెమినికిరణ్, సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ప్రేమతో కూడిన కుటుంబ కథాచిత్రమిదని తెలిపారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రం విడుదలవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌ః పి.సి.శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: నవీన్ నూలి: ఆర్ట్‌ః అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్‌ప్లే : సతీష్ చంద్రపాశం.

Nitin-Suresh’s Rang de movie begins

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కుటుంబ కథా చిత్రం ప్రారంభం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: