విభజన అంశాలపై భేటి

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాల సిఎస్ ల ప్రత్యేక భేటి 9 అంశాలు అజెండాగా చర్చలు, డిఎస్‌పిల పదోన్నతుల వివాదంపై చర్చ ఢిల్లీలోని ఎపి భవన్ విభజనపై కేంద్రం జోక్యం వద్దు విద్యుత్ ఉద్యోగుల కోసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించండి- టిఎస్ చట్టప్రకారం టాక్స్ ఎరియర్స్ హెడ్ క్వార్టర్ ఆధారంగా పూర్తిగా తెలంగాణావే- టిఎస్ సింగరేణి, అప్మెల్ సంస్థల విభజన డిమాండ్ అసంబద్ధం, చట్ట విరుద్ధమని పేర్కొన్న- టిఎస్ మన తెలంగాణ/హైదరాబాద్ […] The post విభజన అంశాలపై భేటి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, ఎపి రాష్ట్రాల సిఎస్ ల ప్రత్యేక భేటి
9 అంశాలు అజెండాగా చర్చలు, డిఎస్‌పిల పదోన్నతుల వివాదంపై చర్చ
ఢిల్లీలోని ఎపి భవన్ విభజనపై కేంద్రం జోక్యం వద్దు
విద్యుత్ ఉద్యోగుల కోసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించండి- టిఎస్
చట్టప్రకారం టాక్స్ ఎరియర్స్ హెడ్ క్వార్టర్ ఆధారంగా పూర్తిగా తెలంగాణావే- టిఎస్
సింగరేణి, అప్మెల్ సంస్థల విభజన డిమాండ్ అసంబద్ధం, చట్ట విరుద్ధమని పేర్కొన్న- టిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్ : విభజన అంశాలపై బుధవారం ఢిల్లీలో తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 9, 10 షెడ్యూల్‌ల్లోని సంస్థల విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై రెండు రాష్ట్రాల మధ్య చర్చ జరిగింది. మొత్తం 9 అంశాలు అజెండాగా సమావేశం జరిగింది. పోలీసు శాఖలో డిఎస్‌పిల పదోన్నతుల వివాదంపై మరోసారి చర్చ జరిగింది. అలాగే షీలాభిడే రూపొందించిన మార్గదర్శకాల మేరకు 68 సంస్థల విభజనకు తెలంగాణా సమ్మతం తెలిపింది. హెడ్ క్వార్టర్ నిర్వచనంపై స్పష్టత లేదని ఎపి పెట్టిన పేచీ మేరకు 14 సంస్థల విభజన సందిగ్ధంలో పడింది. దీంతో ఒక్కో సంస్థపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి వీటి విభజన చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇక 9 వ షెడ్యూల్లో పేర్కొన్న కారణంగా అప్మేల్, సింగరేణి సంస్థల విభజన కూడా 42:58 దామాషలో జరగాలని ఎపి పట్టుబట్టింది.

అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014, షెడ్యూల్ 12 లోని సెక్షన్ 90 ప్రకారం ఎపి డిమాండ్ పూర్తిగా చట్ట విరుద్దం అని తెలంగాణా ఖరాఖండిగా తేల్చిచెప్పింది. షీలాభిడే కమిటీ కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పిందని, ఎపి అధికారులకు తెలంగాణా అధికారులు గుర్తు చేశారు. ఇక రూ.3 వేల కోట్ల టాక్స్ ఎరియర్స్ పంపకాలు కూడా వెంటనే జరపాలని ఎపి వాదించగా, ఎరియర్స్ మొత్తం అన్ని కోట్ల రూపాయలు ఉండవని తెలంగాణా స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటివి ఏమైనా వచ్చినా, చట్ట ప్రకారం, అవి సంస్థ హెడ్ క్వార్టర్ ఆధారంగా పూర్తిగా తెలంగాణాకే చెందుతాయని అధికారులు స్పష్టం చేశారు. అటు విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం కూడా ఇరు పక్షాల మధ్య చర్చకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వైఖరి కారణంగా తెలంగాణా రాష్ట్రంపై 1200 మంది విద్యుత్ ఉద్యోగుల జీతాల రూపంలో వేల కోట్ల రూపాయల భారం పడుతుందని వెల్లడించింది. అవసరమయితే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించైనా ఎపి వాళ్ళను వెంటనే తీసుకోవాలని కోరింది. వీటితో పాటు 10 వ షెడ్యూల్ సంస్థల విభజన అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఇక, ఢిల్లీ ఎపి భవన్ విభజన అంశాన్ని రెండు రాష్ట్రాలు కూర్చోని పరిష్కరించుకుంటామని అధికారులు కేంద్రానికి తెలిపారు. గత ఏప్రిల్ 28 న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇదే అంశంపై చర్చ జరిగిందని కేంద్ర హోంశాఖకు వివరించారు. భవిష్యత్తులో కూడా ఎపి భవన్ విభజన అంశంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమాలోచనలు జరిపి, అనువైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు.

Two States CS’s meet in Home Ministry Affairs Office

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విభజన అంశాలపై భేటి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: