ఎస్‌బిఐ వడ్డీ రేట్ల కోత

  రుణ వడ్డీ రేటు 0.10 శాతం తగ్గింపు ఎఫ్‌డిలపైనా వడ్డీ రేటు తగ్గింది న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరోసారి వడ్డీ రేట్లలో కోత పెట్టింది. ఎంసిఎల్‌ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్)లో 0.10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపుతో ఒక ఏడాది ఎంసిఎల్‌ఆర్ అంటే 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గనుంది. అక్టోబర్ 10 నుండి కొత్త రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుత […] The post ఎస్‌బిఐ వడ్డీ రేట్ల కోత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రుణ వడ్డీ రేటు 0.10 శాతం తగ్గింపు

ఎఫ్‌డిలపైనా వడ్డీ రేటు తగ్గింది

న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) మరోసారి వడ్డీ రేట్లలో కోత పెట్టింది. ఎంసిఎల్‌ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్)లో 0.10 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ తగ్గింపుతో ఒక ఏడాది ఎంసిఎల్‌ఆర్ అంటే 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గనుంది. అక్టోబర్ 10 నుండి కొత్త రేట్లు వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201920)లో ఎంసిఎల్‌ఆర్‌లో వరుసగా ఇది ఆరోసారి కోత. ఆర్‌బిఐ రెపో రేటుతో అనుసంధానించిన రుణాలకు ఈ తగ్గింపు వర్తించదు. అన్ని విభాగాల వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా పండుగ సీజన్‌లో ఎంసిఎల్‌ఆర్‌ను తగ్గించాలని నిర్ణయించినట్లు బ్యాంక్ తెలిపింది. ఆర్‌బిఐ గత వారం రెపో రేటును 0.25 శాతం తగ్గించింది. రెపో రేటును తగ్గించడంతో బ్యాంకులు విధిగా వడ్డీ రేట్లను తగ్గించవలసి ఉంటుంది.

రెపో రేటు అంటే బ్యాంకులు ఆర్‌బిఐ నుండి రుణం తీసుకునే రేటు. అయితే ఆర్‌బిఐ ఆదేశాన్ని అనుసరించి ప్రధాన బ్యాంకులు అక్టోబర్ 1 నుండి వడ్డీ రేట్లను రెపో రేటుతో అనుసంధానించాయి. దీంతో కొత్త వినియోగదారులకు ఆర్‌బిఐ రెపో రేటు తగ్గింపుతో తక్షణ ప్రయోజనం లభిస్తుంది. పాత కస్టమర్లు వారి రుణాలు ఎంసిఎల్‌ఆర్‌తో అనుసంధానిస్తే వారు వారి రుణాన్ని రెపో రేటుతో అనుసంధానించవచ్చు. ఇందుకోసం బ్యాంకు వద్ద దరఖాస్తు చేసుకోవాలి.

ఎఫ్‌డిపై వడ్డీ రేటు తగ్గింపు
ఏడాది నుండి రెండేళ్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (రూ .2 కోట్ల వరకు) వడ్డీ రేటును 6.50 శాతా నుంచి 6.40 శాతానికి తగ్గించారు. అంటే 0.10 బేసిస్ పాయింట్లు కోతపెట్టారు. ఏడాది నుండి రెండేళ్ల వరకు 2 కోట్ల రూపాయలకు పైగా ఎఫ్‌డిలు ఇప్పుడు 6.30 శాతానికి బదులుగా 6 శాతం వడ్డీని పొందుతారు. ఈ రేట్లు సీనియర్ సిటిజన్లకు భిన్నంగా ఉంటాయి. కొత్త ఎఫ్‌డి రేట్లు అక్టోబర్ 10 నుండి వర్తిస్తాయి. తగినంత నగదు ఉన్నందున వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.

State Bank of India cuts MCLR by 10 bps across tenors

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎస్‌బిఐ వడ్డీ రేట్ల కోత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: