జియో కాల్స్ ఉచితం కాదు

  ఇతర ఆపరేటర్ల కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు బాదుడు న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వాయిస్ కాల్స్ చార్జీలు వసూలు చేయలేదు. తొలిసారిగా జియో కాల్స్‌కు చార్జ్ చేయనుంది. ఈమేరకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి జియో నెట్‌వర్క్ నుండి ఇతర ఆపరేటర్ల నెట్‌వర్క్‌లకు చేసిన కాల్‌లకు నిమిషానికి 6 పైసలు ఐయుసి(ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్) చెల్లించాలి. ఐయుసి అంటే ఒక మొబైల్ టెలికం […] The post జియో కాల్స్ ఉచితం కాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇతర ఆపరేటర్ల కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు బాదుడు

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వాయిస్ కాల్స్ చార్జీలు వసూలు చేయలేదు. తొలిసారిగా జియో కాల్స్‌కు చార్జ్ చేయనుంది. ఈమేరకు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ ప్రకటించింది. ఇక నుంచి జియో నెట్‌వర్క్ నుండి ఇతర ఆపరేటర్ల నెట్‌వర్క్‌లకు చేసిన కాల్‌లకు నిమిషానికి 6 పైసలు ఐయుసి(ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్) చెల్లించాలి. ఐయుసి అంటే ఒక మొబైల్ టెలికం ఆపరేటర్ మరో టెలికాం సంస్థకి చెల్లించే మొత్తం. దీనికి గాను కస్టమర్ల నుండి నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని జియో వెల్లడించింది.

 

అయితే కస్టమర్లు చెల్లించే చార్జీలకు సమానంగా ఉచిత డేటాను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. ఈ చార్జీలు అక్టోబర్ 10 నుండి అమల్లోకి వస్తాయని సంస్థ బుధవారం తెలిపింది. ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నిర్ణయించిన ఐయుసి రేట్ల మేరకు అవుట్ గోయింగ్ కాల్స్‌కు చార్జ్ చేయాలని జియో నిర్ణయించింది. ఐయుసి కింద ఇతర ఆపరేటర్లకు గత మూడేళ్లలో రూ.13,500 కోట్లు చెల్లించినట్టు కంపెనీ వెల్లడించింది. ఐయుసి వ్యయాన్ని ఇప్పటి వరకు సంస్థనే చూసుకోవడం వల్ల వాయిస్ కాల్స్‌కు ఎలాంటి చార్జీలు పడలేదు.

Jio Starts Charging 6 Paise per Minute to Other Network

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జియో కాల్స్ ఉచితం కాదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: