కోరుకుంటే మారిపోమా!

  వేగవంతమైన ఇప్పటి జీవితాల్లో చాలా మందికి తెలియకుండానే కొన్ని అలవాట్లకు బానిసైపోతుంటారు. ఉదయాన్నే అల్పాహారం తప్పనిసరిగా తినాలని తెలిసినా కొంతమంది మహిళలు నిర్లక్షం చేస్తారు. వారానికి కనీసం నాలుగు రోజులన్నా వ్యాయామం చేయాలనుకున్నా చేయలేరు. బద్ధకిస్తారు. ఇలాంటివన్నీ వినడానికి చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. కానీ తర్వాత అనారోగ్య సమస్యలుగా మారతాయి. మంచి అలవాట్లను నెమ్మదిగా అనుసరించాలి. ఏదో తిన్నాం.. ఉన్నాం అనుకోకుండా ప్రతి మహిళా తమ కోసం కూడా సమాయాన్ని కేటాయించుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. […] The post కోరుకుంటే మారిపోమా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వేగవంతమైన ఇప్పటి జీవితాల్లో చాలా మందికి తెలియకుండానే కొన్ని అలవాట్లకు బానిసైపోతుంటారు. ఉదయాన్నే అల్పాహారం తప్పనిసరిగా తినాలని తెలిసినా కొంతమంది మహిళలు నిర్లక్షం చేస్తారు. వారానికి కనీసం నాలుగు రోజులన్నా వ్యాయామం చేయాలనుకున్నా చేయలేరు. బద్ధకిస్తారు. ఇలాంటివన్నీ వినడానికి చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. కానీ తర్వాత అనారోగ్య సమస్యలుగా మారతాయి. మంచి అలవాట్లను నెమ్మదిగా అనుసరించాలి. ఏదో తిన్నాం.. ఉన్నాం అనుకోకుండా ప్రతి మహిళా తమ కోసం కూడా సమాయాన్ని కేటాయించుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. నేను మారాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంటే కచ్చితంగా ఒక పరిపూర్ణమైన మనిషిలా మారిపోవచ్చు.

“నా లోపం ఏదో నేను కనిపెట్టాను. ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకున్నా ఎందుకు ఫెయిల్ అవుతున్నానో ఇప్పటికి బోధపడింది” అంది పద్మజ. ‘జనవరిలో అనుకుంటూ ఈ సంవత్సరం నేను పూర్తిగా మారిపోతా… అని నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం మొత్తం ఏదో మార్పులు చేస్తూనే ఉన్నావు కదా! మళ్లీ కొత్తగా ఇదేమిటీ?” అంది శైలజ. ఇద్దరూ ఒక కార్పొరేట్ ఆఫీస్‌లో కొలీగ్స్. “ అదేనోయ్ చెబుతున్నా వెతుక్కుంటే నాలో ఎన్నో లోపాలు కనిపించేవి. మారిపోయి ఒక పద్ధతిగా నడుద్దాం అనుకున్నాను. కానీ మారేందుకు ఒక దారి వెతికాను కదా! అసలదే తప్పు”

‘మళ్లీ చెప్పు అర్థం కాలేదు’
‘రెండు నెలలక్రితం నేచర్ క్యూర్‌కి వెళ్లానా లేదా! స్పాలో సానాలు, భోజనాలు అన్ని బుద్ధిగా నడిచాయి. ఇరవై రోజులు తర్వాత ఇంటికొచ్చి మళ్లీ ఎప్పటిలాగే మన కేంటిన్‌లో ఫుడ్, ఉదయం మెలకువ రాకపోవడం యథాప్రకారంగా జరుగుతున్నాయి. మరి నేను సాధించింది ఏమిటి? ఆఫీస్‌లో పని ఒత్తిడి, వేళకు నిద్రపోం. నైట్ డ్యూటీ.. ఏది మారింది చెప్పు. ఎప్పట్లాగే ఉన్నాను. కానీ ఆలోచిస్తే ఇందులో నా లోపం ఏమిటో నాకర్థం అయింది శైలజా… అసలా ఎంపికే సరైనది కాదు.

నేను నా క్లాస్‌మేట్ కల్పనను చూసి, ఆమె పర్‌ఫెక్ట్ జీవన విధానం చూసి ఎప్పటికప్పుడు స్ఫూర్తి తెచ్చుకుంటూ ఉంటాను. కానీ ఇద్దరివీ వేర్వేరు జీవితాలు. ఆమె వృత్తి వేరు. తను యాంకరింగ్‌లో ఉంది. ఫిట్‌నెస్‌గా ఉండటం, శరీరాన్ని ఒక తీరుగా ఉంచుకోవటం ఆమె వృత్తికి అవసరం. మరి నా విషయం చూడు, నేను ఇక్కడ హెచ్.ఆర్. మేనేజర్‌ని. ఎంతో ఒత్తిడితో కూడిన ఉద్యోగ జీవితం నాది. నేను ఆరోగ్యవంతమైన జీవన సరళిలోకి మారాలి అనుకుంటే నాకు పని తర్వాత నేను తినవలసిన ఆహారం, శరీరాన్ని కదిలించే వ్యాయామం, నా ఒత్తిడిని తగ్గించగలిగే అలవాట్లు చేసుకోవాలి. ఆ మార్పు రావాలి. అంతేగానీ కల్పనలాగా నేను మారాలి అనుకోవటం పొరపాటు కదా!

నాలో ఉన్న లోపాలు సరిదిద్దుకోవటం అంటే నా జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి. అంతేగానీ ఆమెలా నేను అయిపోవటం కాదు కదా!” అంది పద్మజ. పద్మజ తెలివైన యువతి కాబట్టి వెంటనే తను చేస్తున్న పొరపాటు సర్దుకోగలిగింది. ప్రతి మనిషిలోనూ ఎన్నో కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని మార్చుకోగలిగితే జీవితం ఇంకాస్త బావుంటుంది. పద్మజకు ఏం కావాలి? ఆమె తొందరగా నిద్రలేచే అలవాటు చేసుకోవాలి. బద్ధ్దకం వదిలేసి పోషకాహారంపైన దృష్టి పెట్టాలి. ఆఫీస్ వాతావరణానికి తగ్గట్టు డ్రస్‌కోడ్, శిరోజాల అలంకరణ, ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు వీటన్నింటిపైన శ్రద్ధ పెడితే పద్మజ జీవితంలో మంచి మార్పు వస్తుంది.

ప్రతి మనిషికీ చిన్నప్పటి నుంచి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లే కొన్ని లోపాలు అవుతాయి కూడా. ఉదాహరణకు తినే ఆహారంలో నూనె, నెయ్యి అతిగా వాడటం అలవాటుగా ఉంటే, నూనె వాడకం పాతికేళ్లు దాటాక శరీరం బరువును పెంచితే అది లోపం అయిపోతుంది. దాన్ని పట్టుబట్టి మార్చుకోవచ్చు. అలాగే చాలామంది పనుల్ని ఎప్పుడూ వాయిదా వేస్తారు. ప్రతిదానికీ రేపు అనే సమాధానం ఉంటుంది. ఆ రేపుని పక్కనబెట్టి ఇవ్వాళే మార్చుకుంటే అది మంచి మార్పే. బాడీ లాంగ్వేజ్‌లో లోపాలుంటాయి. తిన్నగా నిలబడటం, సూటిగా చూస్తూ మాట్లాడటం, మాట్లాడే భాషలో దురుసుతనం ఉండటం మేకప్ అతిగా ఉండటం, అరుస్తూ మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం… అస్తమానం ఫోన్‌లో తల దూర్చటం ఇవన్నీ చిన్న లోపాలు కింద లెక్క. ఇలాంటి లోపాలను సవరించుకోవచ్చు.

ఈ మార్పుతో జీవన సరళి మారిపోయింది. అలా మారాలి అనుకుంటే ఆ మార్పుకు అవసరమైన అంశంపైన ఆసక్తి కలిగించు కోవాలి. ఆ మార్పు కోరుకుంటూ చేసే పనుల పట్ల ఉత్సాహం ఉండాలి. ఆరోగ్యకరమైన అలవాట్లు మనుషుల జీవితాలు మార్చేస్తాయి. ఉదయపు నడక, తియ్యని పదార్థాలు అవతల పెట్టటం, జంక్‌ఫుడ్ మానేయటం, ఇంట్లో అందరూ కూర్చుని ఒకేసారి భోజనం చేయటం, మన పిల్లలకు మనం ఆదర్శంగా ఉండటం ఇవన్నీ చాలా అవసరం. ‘ నా జీవితం నా అదుపులో ఉంటుందనే’ నినాదం మనసులో మెదులుతూ ఉంటే అప్పుడు వెనకడుగు వేయటం అనేది ఉండదు. ప్రతి చిన్న లోపాన్ని సవరించుకుంటూ పోవటం చాలా తేలిక అవుతుంది.

People addicted some habits in present days

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోరుకుంటే మారిపోమా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: