ఆర్‌టిసిలో కొత్త నియామకాలపై ప్రభుత్వం దృష్టి?

  మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసిలో కొత్త నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగానే సాధ్యమైనంత త్వరగా నూతనంగా బస్సు కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలను చేపట్టే అంశంపై దృష్టి సారించింది. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో […] The post ఆర్‌టిసిలో కొత్త నియామకాలపై ప్రభుత్వం దృష్టి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసిలో కొత్త నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం
కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అవకాశాలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగానే సాధ్యమైనంత త్వరగా నూతనంగా బస్సు కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలను చేపట్టే అంశంపై దృష్టి సారించింది. ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆర్‌టిసిలో ఏ ఏ కేటగిరిల్లో ఎన్ని ఉద్యోగాలను చేపట్టాలనే ఫైల్‌ను సిద్దం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని సమాచారం. రెండు రోజుల్లో అధికారులు ఈ నివేదికను రూపొందించి సిఎంకు అందించనున్నారు. దీనిని సమీక్షించి సిఎం కెసిఆర్ కొత్త కొలవులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కార్మికులు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరడంతో ప్రభుత్వం ప్రత్యామ్నయమార్గాలను మరింత శరవేగంగా అమలు చేసే పనిలో ఉంది.

ఇందులో భాగంగానే కొత్త ఉద్యోగులను చేర్చుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించినట్లుగా వినిపిస్తోంది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం బస్సులను పోలీసు ఎస్కార్టుతో తిప్పుతున్నప్పటికీ అవి ప్రజల సమయానికి అందుబాటులో ఉండటం లేదు. ముఖ్యమైన రూట్లలోనే కొంతమంది కండక్టర్లను, డ్రైవర్లను తాత్కాలికంగా నియమించి ప్రభుత్వం బస్సులను నడుపుతోంది. దీంతో ప్రయాణికులకు సమస్యలు తప్పడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకునే కొత్త నియామకాలపై ఆర్‌టిసి ముఖ్య కార్యదర్శి సునీశర్మ, కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియాలు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా రిక్రూట్ చేసుకునే కండక్టర్లు, డ్రైవర్ల విషయంలో ఉండాల్సిన విధి విధానాలు, ఇతర నిబంధనల విషయంలో అధికారులు తలమునకలైనట్టుగా తెలుస్తోంది.

TS Govt Focus on New RTC Recruitment 2019?

The post ఆర్‌టిసిలో కొత్త నియామకాలపై ప్రభుత్వం దృష్టి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: