రవిప్రకాశ్ కేసు విచారణ రేపటికి వాయిదా

  హైదరాబాద్: టివి9 నిధుల కుంభకోణంలో చంచల్‌గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిప్రకాశ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నోటీసులు ఇచ్చిన కోర్టువారు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చీటింగ్ చేసిన కేసులో గత శనివారం నాడు అరెస్ట్ అయిన టివి9 మాజి సిఇఒ రవిప్రకాశ్ చంచల్‌గూడలో జైలు అధికారులు అండర్ ట్రయిల్ ఖైదీ నంబర్ 4412ను కేటాయించిన అనంతరం కృష్ణా బ్యారక్‌లో ఉంచిన […] The post రవిప్రకాశ్ కేసు విచారణ రేపటికి వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: టివి9 నిధుల కుంభకోణంలో చంచల్‌గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవిప్రకాశ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నోటీసులు ఇచ్చిన కోర్టువారు విచారణను గురువారానికి వాయిదా వేసింది. చీటింగ్ చేసిన కేసులో గత శనివారం నాడు అరెస్ట్ అయిన టివి9 మాజి సిఇఒ రవిప్రకాశ్ చంచల్‌గూడలో జైలు అధికారులు అండర్ ట్రయిల్ ఖైదీ నంబర్ 4412ను కేటాయించిన అనంతరం కృష్ణా బ్యారక్‌లో ఉంచిన విషయం విదితమే. రవిప్రకాశ్‌ను జైలు అధికారులు సాధారణ ఖైదీగానే సింగిల్ బ్యారక్‌లో ఉంచారు. ఈ క్రమంలో రవిప్రకాశ్‌కు కోర్టు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. కాగా రవిప్రకాశ్. మరో డైరెక్టర్ ఎంకెవిఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకున్నారంటూ ప్రస్తుత టివి9 సిఇఒ గొట్టిపాటి సింగారావు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దీంతో బంజారాహిల్స్ పోలీసులు ఐపిసి 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టు ఆయనకు ఈ నెల 18వ తేదీ వరకూ రిమాండ్ విధించడంతో బంజారాహిల్స్ పోలీసులు తమ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రవిప్రకాశ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడితే తాను చేసిన అవినీతి వివరాలకు సంబంధించిన ఆధారాలు సేకరించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. టివి9 యాజమాన్యమైన అలందా మీడియా హౌజ్‌కు చెందిన రూ. 18 కోట్ల మొత్తాన్ని బోనస్‌ల పేరుతో పక్కదారి పట్టించారన్న రవిప్రకాశ్‌పై అభియోగాలకు ఆధారాలను సేకరించేందుకు పోలీసులు చంచల్‌గూడ జైల్లో ఉన్న రవిప్రకాశ్‌ను మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

Police Petition for Ravi Prakash Custody Hearing in Court

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రవిప్రకాశ్ కేసు విచారణ రేపటికి వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: