ఆర్టీసి సమ్మెపై రోజా కీలక వ్యాఖ్యలు

  అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసి సమ్మెపై ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ ఆర్.కె. రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో  ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసి సమ్మెపై రోజా పరోక్షంగా వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని… కానీ, ఎపిలో అలాంటి పరిస్థితులు లేవని రోజా చెప్పారు. […] The post ఆర్టీసి సమ్మెపై రోజా కీలక వ్యాఖ్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసి సమ్మెపై ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ ఆర్.కె. రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో  ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసి సమ్మెపై రోజా పరోక్షంగా వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరితే కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారని… కానీ, ఎపిలో అలాంటి పరిస్థితులు లేవని రోజా చెప్పారు. ఎపిలో ఆర్టీసి సంస్థని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్ల కార్మికులంతా కృతజ్ఞతతో ఉండాలని అన్నారు. ఆర్టీసి ఉద్యోగులు పట్టుబట్టి డిమాండ్ చేయకపోయినా, పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి సిఎం జగన్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. ఎపిలో ఆర్టీసి ఈ స్థాయిలో బలంగా ఉందంటే, అందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత సిఎం జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని రోజు పేర్కొన్నారు.

MLA Roja Sensational Comments on TS RTC Strike

The post ఆర్టీసి సమ్మెపై రోజా కీలక వ్యాఖ్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: