కొత్త మున్సిపల్ చట్టానికి గవర్నర్ ఆమోదం..!

  హైదరాబాద్: కొత్త పురపాలక చట్టానికి ఉభయసభలు ఆమోదించిన బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ఐటి పురుపాలక శాఖ మంత్రి కెటిఆర్ కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో పురపాలక బిల్లును ప్రవేశపెట్టగా ప్రతీపక్షలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో, పట్టణాల్లో ఆరు వేరు వేరు చట్టాలు అమలులో […] The post కొత్త మున్సిపల్ చట్టానికి గవర్నర్ ఆమోదం..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కొత్త పురపాలక చట్టానికి ఉభయసభలు ఆమోదించిన బిల్లుకు గవర్నర్ తమిళసై ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ఐటి పురుపాలక శాఖ మంత్రి కెటిఆర్ కొన్ని రోజుల క్రితం అసెంబ్లీలో పురపాలక బిల్లును ప్రవేశపెట్టగా ప్రతీపక్షలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో, పట్టణాల్లో ఆరు వేరు వేరు చట్టాలు అమలులో ఉన్నాయని, అవి అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా రూపొందించిన్నాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఆ చట్టాలకు పొంతన లేదని సభలో చెప్పారు.

 చట్టాల్లో ఉన్న లోపాల వలన పట్టణ ప్రణాళిక ముందుకు సాగటం లేదని, ప్రజల అవసరాలకు మరియు పరిస్థితులకు తగినట్లు కొత్త మున్సిపల్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టామని వివరించారు. ఈ మున్సిపల్ చట్టం ప్రధాన ఉద్ధేశ్యం పట్టణ మరియు నగర పాలనను సంస్థాగతంగా బలోపేతం చేయటం, పూర్తి పాలనను పారదర్శకంగా ఉండేలా చూసుకోవడం, అనుమతులు త్వరితగతిన ఇవ్వటం, అవినీతికి ఆస్కారం లేకుండా చేయటం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్ధేశ్యమని కెటిఆర్ పేర్కొన్నారు.
Governor Tamilisai Permissions To New Municipal Act

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొత్త మున్సిపల్ చట్టానికి గవర్నర్ ఆమోదం..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: