అన్నంలో వెంట్రుక వచ్చిందని…భార్యకు గుండు కొరిగాడు

  సాదారణంగా మనం తినే అన్నంలో వెంట్రుక వస్తే దానిని తీసేసి తింటాం. కానీ, ఇక్కడ అలా జరగలేదు. అన్నంలో వెంట్రుక వచ్చిందని కోపంతో రగిలిపోయిన ఓ భర్త, తన భార్యకు గుండు కొట్టించాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని జోయ్‌పుర్హాత్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బబ్లూ మాండల్(35) అనే వ్యక్తికి తన భార్య(23) ఉదయం అల్పాహారం కింద అన్నం, పాలు వడ్డించింది. అయితే, దానిలో ఓ వెంట్రుక రావడంతో భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. కోపంతో […] The post అన్నంలో వెంట్రుక వచ్చిందని… భార్యకు గుండు కొరిగాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాదారణంగా మనం తినే అన్నంలో వెంట్రుక వస్తే దానిని తీసేసి తింటాం. కానీ, ఇక్కడ అలా జరగలేదు. అన్నంలో వెంట్రుక వచ్చిందని కోపంతో రగిలిపోయిన ఓ భర్త, తన భార్యకు గుండు కొట్టించాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని జోయ్‌పుర్హాత్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బబ్లూ మాండల్(35) అనే వ్యక్తికి తన భార్య(23) ఉదయం అల్పాహారం కింద అన్నం, పాలు వడ్డించింది. అయితే, దానిలో ఓ వెంట్రుక రావడంతో భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. కోపంతో భార్యను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అంతటితో ఊరుకోలేదు. తన భార్యను బలవంతంగా కూర్చోబెట్టి బ్లేడుతో గుండు కొరిగాడు. చుట్టుపక్కల వారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు భర్తను అరెస్టు చేశారు. వేధింపుల కేసుకింద అతడిపై కేసు నమోదు చేశామని, భార్యను వేధించినట్లు కోర్టులో నిర్ధారణ అయితే అతను దాదాపు 14 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

A Man Shaves Wife’s Head After Finding Hair in Food

The post అన్నంలో వెంట్రుక వచ్చిందని… భార్యకు గుండు కొరిగాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: