ఎనిమిదేళ్ల తరువాత వీడిన మిస్టరీ…. భార్య ప్రియుడే హంతకుడు

    ఢిల్లీ: ఎనిమిది సంవత్సరాల తరువాత మర్డర్ మిస్టరీ వీడిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు… పెద్దలు తిరస్కరించడంతో యవతి భర్తను ఆమె ప్రియుడు దారుణంగా చంపిన సంఘటన ఎనిమిది సంవత్సరాల తరువాత వెలుగలోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతం తపుకర గ్రామంలో కమల్ సింగ్లా (22), శుకుంతల (20) గాఢంగా ప్రేమించుకున్నారు. యువతి, యువకుడి కులాలు వేరు కావడంతో పెద్దలు అభ్యంతరం తెలిపారు. దీంతో శకుంతల […] The post ఎనిమిదేళ్ల తరువాత వీడిన మిస్టరీ…. భార్య ప్రియుడే హంతకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

ఢిల్లీ: ఎనిమిది సంవత్సరాల తరువాత మర్డర్ మిస్టరీ వీడిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. యువతి, యువకుడు ప్రేమించుకున్నారు… పెద్దలు తిరస్కరించడంతో యవతి భర్తను ఆమె ప్రియుడు దారుణంగా చంపిన సంఘటన ఎనిమిది సంవత్సరాల తరువాత వెలుగలోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాజస్థాన్‌లోని అల్వార్ ప్రాంతం తపుకర గ్రామంలో కమల్ సింగ్లా (22), శుకుంతల (20) గాఢంగా ప్రేమించుకున్నారు. యువతి, యువకుడి కులాలు వేరు కావడంతో పెద్దలు అభ్యంతరం తెలిపారు. దీంతో శకుంతల తల్లిదండ్రులు త్వరగా వరుడిని చూసి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమల్ సింగ్లాతో శకుంతల పారిపోదామని తెలిపడంతో అతడు వ్యతిరేకించాడు. ఇంతలోనే శకుంతలకు తల్లిదండ్రులు రవి అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. హమ్రాజ్, హెలెన్ ఆఫ్ ట్రాయ్ అనే సినిమాలు వీక్షించి శకుంతల భర్తను చంపాలని సింగ్లా నిర్ణయం తీసుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా 70,000 రూపాయలకు రవిని చంపాలని గణేష్‌తో సింగ్లా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పెళ్లి జరిగిన మూడు రోజుల తరువాత రవి తన భార్య తో కలిసి బయటకు వెళ్లాడు. వాళ్లు వెళ్తున్న స్థలాన్ని ముందుగానే శకుంతల తన లవర్ సింగ్లాకు తెలియజేసింది. దంపతులను దారిలో వాళ్లు ఆపి శకుంతల స్నేహితుడు ఆమెను తన భర్త బంధువుల ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్లాడు.  రవిని గణేష్, సింగ్లా పట్టుకొని మాట్లాడుదామని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. గణేష్, సింగ్లా కలిసి రవి మెడకు తాడుతో ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం మృతి దేహాన్ని గుంత తీసి పాతిపెట్టారు. రవి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శకుంతలను పలు విధాలుగా ప్రశ్నించారు. రవి తనని బంధువుల దగ్గర వదిలి పెట్టి ఐదు నిమిషాలలో వస్తానని చెప్పి వెళ్లాడని పోలీసులకు ఆమె వివరించింది. ఈ కేసుకు సంబంధించిన పురోగతి లేకపోవడంతో రవి తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ కింద కోర్టులో కేసు వేయడంతో పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. కమల్ సింగ్లా, గణేష్, శంకుతల ఆచూకీ లేకపోవడంతో వారిపై స్థానిక క్రై ఎస్‌పి జాయ్ ట్రిక్కీ అనుమానం వచ్చింది. దీంతో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు తనదైన శైలిలో విచారించగా అసలు నిజాలు ఒప్పుకున్నారు. తిజారా ప్రాంతంలో పాతిపెట్టిన రవి మృతదేహాన్ని బయటకు తీసి 200 ఎముకలను శవపరీక్షకు పంపించారు.

 

Wife Killed Husband with Lover after 8 Years Solved

The post ఎనిమిదేళ్ల తరువాత వీడిన మిస్టరీ…. భార్య ప్రియుడే హంతకుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: