కారులోయువతి, యువకుడి మృతదేహం…

చెన్నై: కారులో యువతి, యువకుడి మృతదేహం కనిపించిన సంఘటన తమిళనాడులోని సాలేమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అంగళమ్మ కోయిల్ ప్రాంతానికి చెందని గోపీ కుమారుడు జి సురేష్, మరియమ్మ కోయిల్ ప్రాంతానికి చెందిన జ్యోతిక ఇద్దరు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నట్టు సమాచారం. సురేష్ వెండి అభరణాలు అమ్ముతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో జ్యోతికతో సురేష్ ప్రేమలో పడ్డారు. మంగళవారం రాత్రి నుంచి సురేష్ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో […] The post కారులోయువతి, యువకుడి మృతదేహం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నై: కారులో యువతి, యువకుడి మృతదేహం కనిపించిన సంఘటన తమిళనాడులోని సాలేమ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. అంగళమ్మ కోయిల్ ప్రాంతానికి చెందని గోపీ కుమారుడు జి సురేష్, మరియమ్మ కోయిల్ ప్రాంతానికి చెందిన జ్యోతిక ఇద్దరు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నట్టు సమాచారం. సురేష్ వెండి అభరణాలు అమ్ముతూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో జ్యోతికతో సురేష్ ప్రేమలో పడ్డారు. మంగళవారం రాత్రి నుంచి సురేష్ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన తండ్రి గోపీ ఫిర్యాదు చేశాడు. గోపీ కుటుంబ సభ్యులు కూడా సురేష్ కోసం వెతకడం ప్రారంభించారు. సురేష్‌కు కారు షెడ్ ఉండడంతో అక్కడ కుమారుడి కోసం తండ్రి వెతికాడు. ఈ క్రమంలో షెడ్‌లో ఉన్న షటర్‌ను ఓపెన్ చేయగా కారు కనిపించింది. కారులో సురేష్, ఆయన గర్ల్ ఫ్రెండ్ మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం సాలేమ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Young Girl, Boy Dead Bodies Found in Car in Salem

The post కారులోయువతి, యువకుడి మృతదేహం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: