హుజూర్‌నగర్ అభివృద్ధి టిఆర్ఎస్ తోనే : జగదీశ్ రెడ్డి

సూర్యాపేట : హుజుర్ నగర్ అభివృద్ధి అధికార టిఆర్ఎస్ తోనే సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మేళ్లచెరువు మండలం హేమలతండాలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ అభివృద్ధి కోసం చేసింది శూన్యమని ఆయన ధ్వజమెత్తారు. ఈ ప్రాంత ప్రజలు ఉత్తమ్ ను నమ్ముకుంటే, ఆయన మాత్రం ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఉత్తమ్ […] The post హుజూర్‌నగర్ అభివృద్ధి టిఆర్ఎస్ తోనే : జగదీశ్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సూర్యాపేట : హుజుర్ నగర్ అభివృద్ధి అధికార టిఆర్ఎస్ తోనే సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మేళ్లచెరువు మండలం హేమలతండాలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ అభివృద్ధి కోసం చేసింది శూన్యమని ఆయన ధ్వజమెత్తారు. ఈ ప్రాంత ప్రజలు ఉత్తమ్ ను నమ్ముకుంటే, ఆయన మాత్రం ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఉత్తమ్ అభివృద్ధి నిరోధకుడని ఆయన ఘాటుగా విమర్శించారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందిందని, హుజుర్ నగర్ అభివృద్ధికి బాటలు వేసేందుకు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు. సైదిరెడ్డి విజయం సాధిస్తే హుజుర్ నగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేసుకోవచ్చని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ స్థానం నుంచి సైదిరెడ్డి విజయం ఖాయమైందని, మెజార్టీపైనే దృష్టి పెట్టామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డితో పాటు ఎంపి బడుగుల లింగయ్యయాదవ్, ఎంఎల్ఎలు బొల్లం మల్లయ్య యాదవ్, గాదారి కిషోర్, శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Minister Jagdish Reddy Comments On TPCC Chief Uttam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హుజూర్‌నగర్ అభివృద్ధి టిఆర్ఎస్ తోనే : జగదీశ్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: