నగరంలో భారీ వర్షాలు …బయటకు రాకండి : లోకేశ్ కుమార్

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్ నగర ప్రజలకు సూచించారు. రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడే అవకాశం వందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా నగరంలో నీటి నిల్వలు ఉండే […] The post నగరంలో భారీ వర్షాలు … బయటకు రాకండి : లోకేశ్ కుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్ నగర ప్రజలకు సూచించారు. రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగులు కూడా పడే అవకాశం వందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా నగరంలో నీటి నిల్వలు ఉండే ప్రాంతాల్లో జిహెచ్ఎంసి బృందాలు పర్యటిస్తాయని ఆయన చెప్పారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ తెరువవద్దని , జిహెచ్ఎంసి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. విద్యుత్ స్తంభాల పక్కన, భారీ చెట్ల పక్కన ప్రజలు నిలుచుండరాదని ఆయన పేర్కొన్నారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు జిహెచ్ఎంసి సిబ్బంది అన్ని వేళలా సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

Heavy Rains In Hyderabad … Don’t Come Out

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నగరంలో భారీ వర్షాలు … బయటకు రాకండి : లోకేశ్ కుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: