పోలీసు అధికారికి మాలిష్ చేసిన వానరం (వైరల్ వీడియో)

పిల్భిత్(యుపి): పోలీసు ఉద్యోగమంటేనే చెప్పలేనంత టెన్షన్. పరిష్కరించవలసిన కేసులు ఎన్నో ఉంటాయి. అలాగే దోషులను పట్టుకోవడానికి సాక్షాధారాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. కొత్త కేసులు వచ్చే కొద్దీ పాత కేసులు పేరుకుపోతుంటాయి. ఇంతటి పని ఒత్తిడిలో ఉండే పోలీసు అధికారికి ఉపశమనం ఎలా లభిస్తుంది? తలకు మాలీషు చేయించుకుంటే కొంత రిలాక్స్ కావచ్చనుకున్నారేమో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిల్భిత్ పోలీసు స్టేషన్ అధికారి శ్రీకాంత్ ద్వివేది. అయితే ఆయనకు మాలీషు చేయడానికి వచ్చింది మాత్రం ఓ వానరం. ద్వివేది భుజానపైకెక్కి […] The post పోలీసు అధికారికి మాలిష్ చేసిన వానరం (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పిల్భిత్(యుపి): పోలీసు ఉద్యోగమంటేనే చెప్పలేనంత టెన్షన్. పరిష్కరించవలసిన కేసులు ఎన్నో ఉంటాయి. అలాగే దోషులను పట్టుకోవడానికి సాక్షాధారాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. కొత్త కేసులు వచ్చే కొద్దీ పాత కేసులు పేరుకుపోతుంటాయి. ఇంతటి పని ఒత్తిడిలో ఉండే పోలీసు అధికారికి ఉపశమనం ఎలా లభిస్తుంది? తలకు మాలీషు చేయించుకుంటే కొంత రిలాక్స్ కావచ్చనుకున్నారేమో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిల్భిత్ పోలీసు స్టేషన్ అధికారి శ్రీకాంత్ ద్వివేది.

అయితే ఆయనకు మాలీషు చేయడానికి వచ్చింది మాత్రం ఓ వానరం. ద్వివేది భుజానపైకెక్కి ఆయన తలకు మసాజు చేస్తున్న ఒక వానరం తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పూర్తిగా పనిలో నిమగ్నమైపోయిన ద్వివేది తన భుజంపైన ఎక్కింది ఎవరో కూడా తెలుసుకోలేనంత ధ్యాసలో ఉండగా ఆ వానరం మాత్రం ఆయన తలలో పేలు వెతుకుతున్నట్లు తదేకంగా జుట్టును కెలికే పనిలో పడింది.

ఇద్దరూ సీరియస్‌గా తమ తమ పనుల్లో బిజీగా ఉండగా పోలీసు స్టేషన్ సిబ్బంది ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హాస్యం పుట్టిస్తున్న ఈ వీడియోపై కొందరు నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ ద్వివేది నిత్యం షాంపూతో తల స్నానం చేసి పేల సమస్య నుంచి బయటపడాలని కొందరు సలహాలు కూడా ఇస్తున్నారు.

Monkey gives head massage to Police Officer while he works, The video was filmed in Pilbhit police station in Uttar Pradesh

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పోలీసు అధికారికి మాలిష్ చేసిన వానరం (వైరల్ వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: