పిల్లిని స్క్రూడ్రైవర్‌తో పొడిచి…. 9000 జరిమానా

  ముంబయి: మహారాష్ట్రలోని చెంబూర్‌లో ఓ పిల్లిని చిత్రహింసలు పెట్టి చంపిన వ్యక్తికి కోర్టు రూ. 9000 జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 2018 మే 14న ఇందిరా నగర్ లో సంజయ్ గాదే అనే వ్యక్తి పిల్లి పట్టుకొని చిత్రహింసలు పెట్టి స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపాడు. అనంతరం పిల్లి మెడకు తాడు కట్టి అనంతరం కర్ర సహాయంతో డస్ట్‌బిన్‌లో వేయడానికి బయటకు తీసుకొచ్చాడు. వెంటనే ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని చిత్రీకరించి జంతు […] The post పిల్లిని స్క్రూడ్రైవర్‌తో పొడిచి…. 9000 జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: మహారాష్ట్రలోని చెంబూర్‌లో ఓ పిల్లిని చిత్రహింసలు పెట్టి చంపిన వ్యక్తికి కోర్టు రూ. 9000 జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 2018 మే 14న ఇందిరా నగర్ లో సంజయ్ గాదే అనే వ్యక్తి పిల్లి పట్టుకొని చిత్రహింసలు పెట్టి స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపాడు. అనంతరం పిల్లి మెడకు తాడు కట్టి అనంతరం కర్ర సహాయంతో డస్ట్‌బిన్‌లో వేయడానికి బయటకు తీసుకొచ్చాడు. వెంటనే ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని చిత్రీకరించి జంతు హక్కుల కార్యకర్తకు సమాచారం ఇచ్చాడు. వెంటనే జంతు హక్కుల కార్యకర్త నిరోలి కోరిడియా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని కోర్టులో హాజరుపరిచారు. తన ఇంటిని చిందరవందర చేయడంతో ఆ పిల్లిని చంపానని కోర్టులో  నిందితుడు అంగీకరించాడు. సంజయ్ మానసిక స్థితి బాగోలేకపోవడంతో కోర్టు అతడికి జైలు శిక్ష విధించికుండా 9150 రూపాయల జరిమానా విధించింది. ఇకపై జంతువులు హింసించవద్దని హెచ్చరించింది.

 

Man Fine RS 90000 for Killing Cat with Screw Driver

The post పిల్లిని స్క్రూడ్రైవర్‌తో పొడిచి…. 9000 జరిమానా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: