ముంబయి లోకల్ ట్రైన్‌లో అగ్నిప్ర‌మాదం

ముంబయి: ముంబయి లోకల్ ట్రైన్‌లో బుధవారం ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభవించింది. ఈ ఘటన వాషి స్టేష‌న్ వ‌ద్ద చోటుచేసుకుంది. ప‌న్వేల్‌-సిఎస్ఎంటీ లోక‌ల్ రైలులో ఈ ప్ర‌మాదం జ‌రిగిందని రైల్వే అధికారులు తెలిపారు. హార్బ‌ర్ లైను రూట్లో లోక‌ల్ ట్రైన్లు పది నిమిషాలు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. రైలు బోగీపై ఉన్న పాంటోగ్రాఫ్ నుంచి ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. గుర్తుతెలియ‌ని వ్య‌క్తి ఆ ప్రాంతంలో బ్యాగును ప‌డివేయ‌డం వ‌ల్లే ఈ అగ్ని ప్ర‌మాదం […] The post ముంబయి లోకల్ ట్రైన్‌లో అగ్నిప్ర‌మాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: ముంబయి లోకల్ ట్రైన్‌లో బుధవారం ఉద‌యం అగ్నిప్ర‌మాదం సంభవించింది. ఈ ఘటన వాషి స్టేష‌న్ వ‌ద్ద చోటుచేసుకుంది. ప‌న్వేల్‌-సిఎస్ఎంటీ లోక‌ల్ రైలులో ఈ ప్ర‌మాదం జ‌రిగిందని రైల్వే అధికారులు తెలిపారు. హార్బ‌ర్ లైను రూట్లో లోక‌ల్ ట్రైన్లు పది నిమిషాలు ఆల‌స్యంగా న‌డుస్తున్నాయి. రైలు బోగీపై ఉన్న పాంటోగ్రాఫ్ నుంచి ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. గుర్తుతెలియ‌ని వ్య‌క్తి ఆ ప్రాంతంలో బ్యాగును ప‌డివేయ‌డం వ‌ల్లే ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగిందన్న అధికారులు… ప్రమాదానికి గురైన బోగీని షెడ్డుకు పంపామన్నారు. అయితే ఈ ప్ర‌మాదం వ‌ల్ల ఎటువంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు.

Train coach catches fire at Vashi station

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ముంబయి లోకల్ ట్రైన్‌లో అగ్నిప్ర‌మాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: