కోడెల ఆత్మహత్య కేసు …విచారణకు హాజరుకాని కుటుంబీకులు

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను బంజారాహిల్స్ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని కోడెల కొడుకు, కూతురుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వారు మాత్రం పోలీసుల విచారణకు హాజరుకాలేదు. గుంటూరుకు వెళ్లి వారిని విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల కోడెల హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కోడెల ఆత్మహత్యపై అధికార […] The post కోడెల ఆత్మహత్య కేసు … విచారణకు హాజరుకాని కుటుంబీకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసు విచారణను బంజారాహిల్స్ పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని కోడెల కొడుకు, కూతురుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వారు మాత్రం పోలీసుల విచారణకు హాజరుకాలేదు. గుంటూరుకు వెళ్లి వారిని విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల కోడెల హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనమైంది. కోడెల ఆత్మహత్యపై అధికార వైసిపి నేతలు , విపక్ష టిడిపి నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో కోడెల ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.

Kodela Suicide Case … Family Members Not Attending Trial

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోడెల ఆత్మహత్య కేసు … విచారణకు హాజరుకాని కుటుంబీకులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: