నాకెందుకు పద్మ విభూషణ్ ఇచ్చారో చెప్పాలి

ముంబై: తాను పాకిస్తాన్ అనుకూలవాదినైతే దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తనకు ఎందుకు అందచేసిందని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల మహారాష్ట్రను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ శరద్ పవార్‌పై బాణాలు ఎక్కుపెడుతూ పాకిస్తాన్ ఇచ్చిన ఆతిధ్యం ఎందుకు అంతగా నచ్చిందో చెప్పాలని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై పవార్ స్పందిస్తూ ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని కాపాడడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. […] The post నాకెందుకు పద్మ విభూషణ్ ఇచ్చారో చెప్పాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: తాను పాకిస్తాన్ అనుకూలవాదినైతే దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తనకు ఎందుకు అందచేసిందని ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల మహారాష్ట్రను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోడీ శరద్ పవార్‌పై బాణాలు ఎక్కుపెడుతూ పాకిస్తాన్ ఇచ్చిన ఆతిధ్యం ఎందుకు అంతగా నచ్చిందో చెప్పాలని ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై పవార్ స్పందిస్తూ ప్రధాని వ్యాఖ్యలను ఖండించారు. ప్రధానమంత్రి కార్యాలయ గౌరవాన్ని కాపాడడంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు.

ప్రధానమంత్రి కార్యాలయం ఒక వ్యవస్థని, సరైన సమాచారాన్ని సేకరించడంలో ఆ వ్యవస్థకు ఎన్నో వర్గాలు ఉంటాయని పవార్ అన్నారు. సరైన సమాచారం తెలుసుకోకుండా ప్రధాని అటువంటి ప్రకటన ఎలా చేయగలరో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తనకు తన సొంత దేశ ప్రయోజనాల కన్నా పాకిస్తాన్ ప్రయోజనాల ఎక్కువని తాను భావిస్తే మోడీ ప్రభుత్వం తనకు పద్మవిభూషణ్ ఇచ్చిందో పురస్కరించిందో ఆయనే చెప్పాలని పవార్ నిలదీశారు.

తాను దేశానికి ఎంతో కొంత సేవ చేశానని భావించే ప్రభుత్వం తనకు ఈ పురస్కారాన్ని అందచేసి ఉంటుందని, మరి ఇప్పుడు ఈ వైరుధ్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఒకపక్క పద్మభూషణ్‌తో గౌరవిస్తూ మరో పక్క ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గౌరవప్రదంగా లేదని పవార్ వ్యాఖ్యానించారు.

NCP Chief Sharad Pawar Rebuts PM Modis charges, Why did the BJP Govt gave me Padma Vibhushan, he asked

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నాకెందుకు పద్మ విభూషణ్ ఇచ్చారో చెప్పాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: