కోట్లు విలువచేసే వాచీని కొట్టేసిన దొంగ

ప్యారిస్: సిగరెట్ తాగేందుకు హోటల్ గది నుంచి బయటకు వచ్చిన ఒక జపాన్ దేశస్తుడి చేతికి కట్టుకున్న 8.40 లక్షల డాలర్ల(సుమారు రూ.6కోట్లు) విలువైన గడియారాన్ని ఒక దొంగ దోచుకుని పారిపోయాడు. గత సోమవారం రాత్రి దమ్ము కొట్టేందుకు ఒక 30 ఏళ్ల జపాన్ దేశస్తుడు తాను బస చేసిన ప్యారిస్‌లోహోటల్ నెపోలియన్ అనే ఐదు నక్షత్రాల హోటల్ నుంచి బయటకు వచ్చాడు. ఇంతలో ఒక అపరిచితుడు వచ్చి తనకు కూడా ఒక సిగరెట్ ఇవ్వమని అడిగాడు. […] The post కోట్లు విలువచేసే వాచీని కొట్టేసిన దొంగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్యారిస్: సిగరెట్ తాగేందుకు హోటల్ గది నుంచి బయటకు వచ్చిన ఒక జపాన్ దేశస్తుడి చేతికి కట్టుకున్న 8.40 లక్షల డాలర్ల(సుమారు రూ.6కోట్లు) విలువైన గడియారాన్ని ఒక దొంగ దోచుకుని పారిపోయాడు. గత సోమవారం రాత్రి దమ్ము కొట్టేందుకు ఒక 30 ఏళ్ల జపాన్ దేశస్తుడు తాను బస చేసిన ప్యారిస్‌లోహోటల్ నెపోలియన్ అనే ఐదు నక్షత్రాల హోటల్ నుంచి బయటకు వచ్చాడు. ఇంతలో ఒక అపరిచితుడు వచ్చి తనకు కూడా ఒక సిగరెట్ ఇవ్వమని అడిగాడు. ఇచ్చే లోగానే ఆ దొంగ చేతికి కట్టుకున్న వాచీని లాక్కుని పరారయ్యాడు.

రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన అత్యంత అరుదైన ఈ చేతి గడియారం డయల్‌లో వజ్రాలు పొదిగి ఉంటాయి. ఫ్రెంచ్ రాజధానిలో బాగా ధనవంతులైన పర్యాటకులు బస చేసే హోటల్ పరిసరాలలో దొంగలు మాటు వేసి ఉంటుంటారని, ఏమరపాటుగా ఉండే పర్యాటకుల వద్ద ఉండే అత్యంత ఖరీదైన చేతి గడియారాలను వీరు లాక్కుని పారిపోతుంటారని ప్యారిస్ పోలీసుల చెప్పారు. ఏ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు డ జన్లకు పైగా ఇటువంటివే ఖరీదైన చేతిగడియారాలు చోరీకి గురైనట్లు పోలీసులు చెప్పారు. అయితే, జపాన్ దేశస్తుడి చేతి వాచీ కొట్టేసిన దొంగ తన చేతిలోని సెల్‌ఫోన్‌ను జారవిడిచి వెళ్లాడని, దీని ఆధారంగా ఇటువంటి చోరీలు చేసే దొంగల ముఠా ఆచూకీ కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు.

Paris thief steals Japanese man costly wrist watch, the watch worth about 8.40 lakh US dollors

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోట్లు విలువచేసే వాచీని కొట్టేసిన దొంగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: