బాలలకు సంబోధకరమైన బాల కథా మంజూష

బాలల కథలు సంస్క ృతి, సంపన్నతను ప్రదర్శించే ఇతివృత్తాలు. సంఘటనలు, వాస్తవాల హాస్యాద్భుత రసాలతో పరిమళించాలి. బాలసాహిత్య కథలు నిర్ణీత ప్రమాణాంశాల ఆధారంగా పరిశీలించబడతాయి. ఆదివామానవుల వాగ్రూపం నుండి పుట్టింది కథ సాహిత్యానికంతటికీ కథయే మూలం. ప్రపంచంలోనే మొదటి సాహిత్యం గద్యంలో వచ్చింది. వయస్సుతో నిమిత్తం లేకుండా అలరించే సాహిత్య ప్రక్రియ కథ. ఇది మౌఖికంగా వస్తుంది. పిల్లలకు కథలను చెప్పుతూ వారసత్వంగా అందిస్తారు. మానవుని శీలాన్ని సరిదిద్దడానికి కథ ఉపయోగపడుతుంది. ఆనందముతోపాటు ఆలోచనలను కూడా పసిమనసుల్లో […] The post బాలలకు సంబోధకరమైన బాల కథా మంజూష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బాలల కథలు సంస్క ృతి, సంపన్నతను ప్రదర్శించే ఇతివృత్తాలు. సంఘటనలు, వాస్తవాల హాస్యాద్భుత రసాలతో పరిమళించాలి. బాలసాహిత్య కథలు నిర్ణీత ప్రమాణాంశాల ఆధారంగా పరిశీలించబడతాయి.

ఆదివామానవుల వాగ్రూపం నుండి పుట్టింది కథ సాహిత్యానికంతటికీ కథయే మూలం. ప్రపంచంలోనే మొదటి సాహిత్యం గద్యంలో వచ్చింది. వయస్సుతో నిమిత్తం లేకుండా అలరించే సాహిత్య ప్రక్రియ కథ. ఇది మౌఖికంగా వస్తుంది. పిల్లలకు కథలను చెప్పుతూ వారసత్వంగా అందిస్తారు. మానవుని శీలాన్ని సరిదిద్దడానికి కథ ఉపయోగపడుతుంది. ఆనందముతోపాటు ఆలోచనలను కూడా పసిమనసుల్లో రేకెత్తిస్తుంది. భారతదేశంలో కథ జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ వైదిక మత వాజ్ఞ్మయాల్లో వ్యాపించింది. ప్రాచీన సాహిత్యంలో కథాతత్వంలో ఆఖ్యానం, నీతికథ, కథ పంచతంత్ర కథలు, బృహత్‌కథ, మున్దుల్లీ, మణికుల్య వంటి బేధాలున్నాయి.

కథకు పుట్టినిల్లు తెలంగాణ, ప్రపంచకథకు మూలాలు తెలంగాణలో ఉన్నాయని పండితుల అభిప్రాయం. హాలుడు గాధాసప్తశతి, గుణాడ్యుడి బృహత్‌కథ, సోమదేవ సూరి కథా సరిత్సాగరం రాశారు. కథ, కథానికల గురించి అగ్ని పురాణంలో చెప్పబడింది. విష్ణుశర్మ పంచతంత్ర కథలు, తాతాచార్యుల కథలు, తెనాలి రామలింగని కథలు, బేతాళ కథలు, చార్‌దర్వీష్ కథలు, అల్లావుద్దీన్ అద్భుత కథలు జనంలో ప్రసిద్ధి చెందినప్పటికీ ఇవి అశు సంప్రదాయ కథలుగా పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే అమ్మమ్మలు, తాతలు పిల్లలకు చెప్పడం, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే కథలు, బావా బావమరుదులు చెప్పుకునే కథలు, పెద్దలు పిల్లలకు చెప్పే కథలు మొదలగు ఎన్నో కథలున్నాయి.

కథల్లో లాలన, ఓదార్పు, అక్కున చేర్చుకునే, ఆదరించే గుణాలుంటాయి, సందేశాత్మకంగా ఉంటాయి. కష్టాల్లో ధైర్యాన్నిస్తూ మార్గనిర్ధేశనం చేస్తాయి. నవ్వును, ఏడ్పులను కలిగిస్తూ దోషాలను సవరిస్తాయి. ఆలోచింపజేస్తూ కర్తవ్యాన్ని బోధిస్తాయి. మనిషి మానసిక వికాసంతోపాటు అభివృద్ధికి తోడ్పడుతాయి.మొదట అశుకథ సంప్రదాయాన్ని కొనసాగించినప్పటికీ సృజనాత్మక లిఖిత రచనలతో కథ వర్ధిల్లుతుంది. తెలంగాణలో అనేక కథలు వచ్చాయి.

తెలంగాణలో బండారు అచ్చమాంబ రాసిన ‘స్త్రీ విద్య’ కథలో ఆధునిక కథా రచన ప్రారంభమయిందని పండితులు అభిప్రాయపడుతున్నారు. 12 కథలు వీరు రాశారు. సత్పాతృధానం నీతిబోధ కథ కలిగించాలి. ఇల్లిందుల సరస్వతిగారు పిల్లల కోసం రచన చేసేటప్పుడు పిల్లలకు అర్థమయ్యే శైలిలో ఉండాలని, వాక్యాలు నిండుగా ఉండాలి కాని వ్యాకరణం పెద్దపెద్ద సమాసాలు అడ్డం రాకూడదని, పిల్లలతో మాట్లాడుతున్న భాషనే ఉపయోగించాలని సరళశైలి ఉండాలంటారు.కల్పనలు, ఊహలు కథా ప్రపంచంలో సజీవరూప చిత్రాలుగా మలచ బడుతాయి. తేలిక భాష, సునిషిత హాస్యంతో ఆశ్చర్యం, ఆనందం, ఆహ్లాదం, కుతూహలం కలిగించే విధంగా ఉండాలి.
సంఘటన చెప్పే తీరులో ప్రత్యేకత సంతరించుకోవాలి. పిల్లలకు వెన్నెలలాంటి మనస్సుతో చెప్పాలి అని ఇరివెంటి కృష్ణమూర్తిగారంటారు.

బాలల కథలు సంస్క ృతి, సంపన్నతను ప్రదర్శించే ఇతివృత్తాలు. సంఘటనలు, వాస్తవాల హాస్యాద్భుత రసాలతో పరిమళించాలి. బాలసాహిత్య కథలు నిర్ణీత ప్రమాణాంశాల ఆధారంగా పరిశీలించబడతాయి.
“బాలల కథా మంజూష” బాలల కథల పుస్తకాన్ని ఉండ్రాల రాజేశం రాశారు. వీరు బాలసాహితీవేత్త, ఉపాధ్యాయులు. పుస్తకం కవరు పేజీపై అడవి జంతువులతో అందంగా చిత్రం వేశారు. పుస్తకం పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయంతో ప్రచురించగా 50 వేల రూపాయలు కాగా ఐతా చంద్రయ్యగారు ముందుమాటనందించారు. కవరు పేజీ రెండు వైపులా ఉండ్రాలకు సంబంధించిన ఫొటోలున్నాయి. ఇందులో 30 కథలున్నాయి. ప్రకృతి రక్షణ కథతో మొదలుకాగా బృందావనం కథతో ముగుస్తుంది.

‘తోటి వ్యాపారుడు’ కథలో గురువయ్య, వరదయ్య ఇద్దరు వ్యాపారస్తులు కాగా గురువయ్య లోభముతో, స్వార్థముతో రైతుల ధాన్యం కొని లాభాలు గడించగా వరదయ్య రైతుల మేలుకై నిజాయితీ వ్యాపారం చేస్తాడు. గురువయ్య ఒకసారి అధిక లాభాలు గడించాలని తక్కువ డబ్బులు ముందుగానే రైతులకు ఇవ్వగా వర్షాలు కురిసి గురువయ్య దివాలా తీసే పరిస్థితుల్లో వరదయ్య సహాయం చేస్తాడు. ఇందులో లోభం ఉండరాదని, కష్టాలలో సహాయం చేయాలనే సందేశం ఉంది.

‘ప్రతిభ’ కథలో చంద్రుడు బాల్యం నుండి చదువుపై ఆసక్తితోపాటుగా ప్రతిభావంతుడిగా రాణించి ఇంజనీర్ పాసవుతాడు. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు మేనేజర్ ప్రతిభను గుర్తిసాడు. కాని రాజకీయాల అవినీతి కలిగిన ప్రపంచంలో ఉద్యోగాలు రానందుకు చింతిస్తున్నప్పటికీ ప్రతిభ గుర్తించిన మేనేజర్ కట్టుబడి ఉద్యోగమిస్తాడు. ఇందులో ప్రతిభ మననుపైకి తీసుకెళ్తుందని సందేశం ఉంది. ‘సుడిగాలి సాయం’ కథలో రాయపల్లి గ్రామంలో ఈశ్వరయ్య ఊర్లో అందరికంటే భిన్నంగా చెత్తను చెత్తబండిలో వేయకుండా ఇంటిముందర కుప్పగా పోస్తాడు. చెత్తతో ఇంటిముందు ఈగలు, దోమలు విపరీతమవుతాయి. ఒకసారి సుడిగాలి వచ్చి చెత్త ఇంట్లో చేరుతుంది. బాధపడుతాడు. స్వార్థంతో ఆలోచించిన ఈశ్వరయ్యలో మంచిమార్పు వస్తుంది. ‘మూలికా వైద్యం’ కథలో సావిత్రమ్మ ఎవరికి ఆపదవచ్చినా మూలికావైద్యం చేసి బాగుచేసేది. ఆమె పేరు మారుమ్రోగుతుంది. ఇది నచ్చని మొగులయ్య మాన్పించాలని పట్టుబట్టాడు. ఒకసారి మొగులయ్య తలకు బమైన గాయంకాగా సావిత్రమ్మనే బాగు చేసింది. తనలో మార్పు వచ్చింది. ఇందులో ఇతరుల మంచితనం, పేరును చూసి ఈర్ష్య పడవద్దనేది సందేశం.

ఇందులో పట్టుదలకు ఫలితం, చెదిరిన కల, నమ్మకం, తాతలగొప్పలు, చదువుల శివయ్య, మిత్రుడి సహకారం, అపరిచిత నక్క, ప్రకృతి ఫలాలు, మూడు బస్తాలు, చదువు విలువ, ఒక ఎకరం పొలము మొదలగు కథలన్నీ సందేశాత్మకంగా చక్కగా ఉన్నాయి. ఇవి పిల్లలను అలరిస్తాయని, ఆలోచింపజేస్తాయని, మంచిమార్గంలో నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహంలేదు. ఉండ్రాల్ల రాజేశంకు అభినందనలు.

Children’s Literature Stories in Telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాలలకు సంబోధకరమైన బాల కథా మంజూష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: