అంతులేని ప్రేమ

  బడి నుండి వేగంగా వస్తూ అమ్మా మాకు పది రోజులు దసరా సెలవులు వదిలారు అంటూ ఉత్సాహంతో అంది వీణ. “నీ కోసమే ఎదురు చూస్తున్నాను. బొమ్మల కొలువు పెట్టాలి. మీ నాన్న ఆఫీస్ పని మీద క్యాంపు వెళ్లారు. మీ నాన్న చేయవలసిన పనులన్నీ నీవు చెయ్యాలి” అంది. “అలాగే అమ్మా..” సంతోషంతో అంది వీణ. మూడు రకాల కొలతలతో ఉన్నబల్లలను మెట్ల ఆకారంలో సర్దడానికి తల్లికి సంతోషంతో ఉత్సాహంగా సహాయం చేసింది. ఆ […] The post అంతులేని ప్రేమ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బడి నుండి వేగంగా వస్తూ అమ్మా మాకు పది రోజులు దసరా సెలవులు వదిలారు అంటూ ఉత్సాహంతో అంది వీణ.
“నీ కోసమే ఎదురు చూస్తున్నాను. బొమ్మల కొలువు పెట్టాలి. మీ నాన్న ఆఫీస్ పని మీద క్యాంపు వెళ్లారు. మీ నాన్న చేయవలసిన పనులన్నీ నీవు చెయ్యాలి” అంది.
“అలాగే అమ్మా..” సంతోషంతో అంది వీణ.
మూడు రకాల కొలతలతో ఉన్నబల్లలను మెట్ల ఆకారంలో సర్దడానికి తల్లికి సంతోషంతో ఉత్సాహంగా సహాయం చేసింది.
ఆ తరువాత తల్లి చెప్పిన పని వినగానే వీణకు చాలా బాధ కలిగించింది. “అమ్మా వెళ్ళక తప్పదా ..అయినా మనింటిలో దుప్పట్లు ఉన్నాయిగా ” అంది వీణ.
“ఉన్నాయి కానీ ఈ దసరా సెలవులకు మీ అమ్మమ్మ తాతయ్యలు నెల్లూరు నుండి వస్తున్నారు. ఇప్పుడే ఇక్కడ
చలి ప్రారంభమవుతోంది. అందరికీ కప్పుకొనడానికి దుప్పట్లు కావాలిగా అందుకే ఈ ఆలోచన” అంది తల్లి.
వీణ చేతికి డబ్బులిస్తూ.. వెళ్లి చీకటి పడేలోపున వచ్చేయి అంది.
“అలాగే అమ్మా బాధాకరమైన గొంతుతో అనడం చూసి” పని చెబితే చాలు ముఖం చిన్న బోతుంది. అసహనంతో అంటున్న తల్లి మాటలకు, నేను పని కోసం బాధపడటంలేదు అని మనసులోనే చెప్పుకొంది వీణ. వీణ కోసం తలుపు దగ్గర కూర్చొని ఎదురు చూడసాగింది తల్లి. ఏమీ తీసుకొనిరాకుండా సైకిల్ పై వచ్చిన కూతుర్ని చూసి “ఏమైంది వీణా” అనుమానంగా అడిగింది.
“అమ్మా ఆ ఆంటీ స్కూటర్‌లో తెస్తోంది” అంటూ చెబుతుండగానే ఒకామె స్కూటర్ నిలిపింది. పందిరికి వేసే పెద్ద జంకాళం గుడ్డను ఆమె తీసుకుని రావడం చూసి చాలా ఆశ్చర్యంగా చూడసాగింది. “చూడండీ నేను షామియానాలు అద్దెకు ఏర్పాటు చేసే అంగడి యజమానురాలు. అంగడిలో కూర్చొన్న నా దగ్గరకు మీ అమ్మాయి వీణ వచ్చి భూమి పర్యావరణం గురించి ఒక చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చి భూమిని కాపాడండి అని అడిగింది” అంది.
“అమ్మా ఆ ఆంటీ చాల మంచి వారమ్మా చెప్పగానే సరేనంటూ నేనేమి చెయ్యాలమ్మా అని అడిగింది” అంది వీణ . “ఆ తరువాత మీ వీణ నాతో, ఆంటీ మా అమ్మ ప్లాస్టిక్ షీట్ కొనుక్కొని రమ్మని డబ్బులు ఇచ్చింది. పది రోజులకు అద్దెగా ఆ డబ్బులు చాల తక్కువైనా తీసుకొని ఒక పెద్ద దుప్పటి ఇవ్వండి. భూమిని కాపాడిన పుణ్యం మీకు లభిస్తుంది. ఏమిటో ఈ కాలంలో ఎవరికీ భూమి మీద అవగాహన కలగటం లేదు’ అంటూ చెప్పగానే అద్దె తక్కువైనా మీకు ఒక పెద్ద జంకాళం తీసుకొని వచ్చాను. మీ కూతురికి భూమి మీద అంతులేని ప్రేమ ఉంది అంది” అంగడి యజమాను రాలు .
“ఇలా ప్రతి ఒక్కరికీ భూమి మీద ప్రేమ ఉంటే ఈ భూమిలో ప్లాస్టిక్ కనుమరుగై పోతుంది” అంటూ కూతుర్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని తల నిమరసాగింది.
ఓట్ర ప్రకాష్ రావు, 97874 46026

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అంతులేని ప్రేమ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.