మారిన గ్రామాల స్వరూపం

  ముగిసిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అద్దంలా తయారైన ఊర్లు =మెరుగుపడ్డ పారిశుద్ధ పనులు వెల్లివిరిసిన పచ్చదనం బాగుపడ్డ విద్యుత్ వ్యవస్థ ప్రతి గ్రామానికి సమకూరిన శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, నర్సరీలు దసరా పండగకు అందంగా ముస్తాబైన ఊర్లు 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ పుణ్యమా అని గ్రామాలన్నీ బాగుపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో గ్రామాల్లో అప్పుడే పండగ కళ ఉట్టిపడుతుంది. పండగ సందర్భంగా ప్రతి ఇల్లాలు […] The post మారిన గ్రామాల స్వరూపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముగిసిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
అద్దంలా తయారైన ఊర్లు =మెరుగుపడ్డ పారిశుద్ధ పనులు
వెల్లివిరిసిన పచ్చదనం
బాగుపడ్డ విద్యుత్ వ్యవస్థ
ప్రతి గ్రామానికి సమకూరిన శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, నర్సరీలు
దసరా పండగకు అందంగా ముస్తాబైన ఊర్లు

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ పుణ్యమా అని గ్రామాలన్నీ బాగుపడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపాదించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో గ్రామాల్లో అప్పుడే పండగ కళ ఉట్టిపడుతుంది. పండగ సందర్భంగా ప్రతి ఇల్లాలు ఇంటిని శుభ్రం చేసుకొని ముస్తాబు చేసిన విధంగా విజయ దశమి పండగ నేపథ్యంలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో గ్రామ రూపురేఖలే మారి పోయాయి. గ్రామాలన్నీ పచ్చదనం, పరిశుభ్రతతో విరాజిల్లుతున్నాయి. గత నెల 6న ప్రారంభమైన 30 రోజుల ప్రత్యేక కార్యా చరణ శనివారంతో ముగిసింది.

గడిచిన 30 రోజుల పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు చేసిన సమష్టి కృషి ఫలితంగా గ్రామాలన్నీ అద్దంలా తయారయ్యాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు కంటిమీద కునుకు లేకుండా ఈ 30 రోజుల పాటు ఒక యజ్ఞంలా పనిచేశారు. జిల్లా కలెక్టర్లు ఆర్‌వి. కర్ణన్, రజత్‌కుమార్ శైనీలు నిత్యం గ్రామాల్లో ఉంటూ అధికారులను పరుగులు పెట్టించడంతో గ్రామాలన్నీ బాగుబడ్డాయి. ఇదేవిధంగా గ్రామ స్థాయి అధికారులు నిరంతరం పనిచేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన పనులను వచ్చే 30 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు

ఖమ్మం : తొలి రోజు గ్రామ సభ నిర్వహించి గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్రలో గుర్తించిన మెజార్టీ సమస్యలని పరిష్కారానికి నోచుకున్నాయి. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను తయారు చేసుకున్నారు. గ్రామ అవసరాలు, మౌళిక సదుపాయాలను గుర్తించారు. ప్రధానంగా ప్రతి గ్రామానికి శ్మశానవాటిక, డంపింగ్ యార్డ్, నర్సరీలు సమకురినట్లైంది. అదేవిధంగా గ్రామాల్లోని విద్యుత్ వ్యవస్థ మెరుగుపడింది. విరిగిపోయిన, వంకరపోయిన విద్యుత్ స్తంబాల స్థానంలో కొత్త వాటిని అమర్చారు. నేలకు తాకే తీగలను సరిచేశారు. ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేసి వాటిని నాటుకునే ఏర్పాట్లు చేశారు. గ్రామానిక ఐదు కి.మీ దూరంలో రోడ్డుకిరువైపుల మొక్కలను నాటారు. ప్రతి గ్రామంలో నర్సరీ సౌకర్యాన్ని కల్పించారు. అవసరంలోని పురాతన బావులు, బోర్ వెల్స్‌ను పూడ్చారు. చెత్తకుప్పలను, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

శిథిలమైన భవనాలను, పురాతన భవనాలను కూల్చివేశారు. వీటి నుంచి వచ్చిన మట్టితో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను చదును చేశారు. ప్రధానంగా చెత్త, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ఇంటింటికీ బుట్టలను అందజేశారు ప్లాస్టిక్ వాడకంపై ప్రచారం చేస్తూ రీసైక్లింగ్ చేసే విధంగా ప్రోత్సహించారు. తడి, పొడి చెత్తను సేంద్రీయ ఎరువుగా తయారు చేసుకోవడానికి రైతులు ముందుకొచ్చారు. రైతులు గొర్రెలు, మేకలు, బర్రెలను రోడ్లపై తిరగకుండా జరిమానా విధిస్తూ అవగాహన కల్పించారు. అంతేగాక పశువుల కోసం షెడ్లను కూడా నిర్మించారు. పలు చోట్ల దాతల సహాయంలో శ్మశానవాటికలకు, డంపింగ్ యార్డ్‌లను నిర్మించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6.86 లక్షల మంది ప్రజలు పారిశుద్ధ్య కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వ్యక్తిగత మరగుదొడ్లను నిర్మించుకోవడానికి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

ఖమ్మం జిల్లాలో 584 గ్రామాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 479 గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక పనులు పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 75 గ్రామాల్లో శ్మశాన వాటికలు ఉండగా మరో 445 గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించారు. ఇందులో 444గామాల్లో శ్మశాన స్థలం గుర్తింపు పనులు కొనసాగుతుండగా ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు మండలంలో ఒక్కొక్క గ్రామాల్లో శ్మశనవాటిలక స్థల సేకరణ పూర్తయ్యింది. ఇంకా 64 గ్రామాల్లో వైకుంఠదామానికి స్థలాన్ని సేకరించాల్సి ఉంది.

ముదిగొండ మండలంలో ఒకటి పూర్తయ్యింది. అదేవిధంగా గ్రామాల్లో సేకరించిన చెత్తను గ్రామ శివారులో డంపింగ్ యార్డ్‌లో వేసే విధంగా ఈ జిల్లాలో 584 గ్రామాల్లో ఇప్పటికే 115 గ్రామాల్లో డంపింగ్ యార్డ్ ఉండగా మరో 422 గ్రామాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం స్థలాన్ని గుర్తించారు. ఇందులో413 గ్రామాల్లో స్థలాన్ని అప్పగించారు. ఇంకా తొమ్మిది గ్రామాల్లో స్థలాన్ని సేకరించాల్సి ఉంది. తిరుమలాయపాలెం మండలంలో ఎనిమిది గ్రామాల్లో, ముదిగొండ మండలంలో ఒక గ్రామాలో సేకరించాల్సి ఉంది.

మెరుగుపడ్డ పారిశుద్ధ్య పనులు : పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా 584 గ్రామాల్లోని 2,62,368 కుటుంబాలకుగాను 1,04,797 కుటుంబాల నుంచి చెత్తను సేకరించారు. 241 గ్రామాల్లో చెత్తను ట్రాక్టర్ల ద్వారా తొలగించారు. మరో ఆరు గ్రామాల్లో చెత్తను కంపోస్టు ఎరువుగా మార్చారు. అదేవిధంగా 584 గ్రామాల్లో మొత్తం 3015ఖాళీ స్థలాలను గుర్తించి అందులో 2703 స్థలాల్లోని చెత్తను తొలగించారు. 10,777 స్థలాల్లో పిచ్చి మొక్కలు, కంప చెట్లు ఉన్నట్లు గుర్తించి 10,410 చోట్ల తొలగించారు. అదేవిధంగా 3935 చోట్ల ఖాళీప్లాట్లు ఉండగా వాటిలో 3551 ప్లాట్లలో శుభ్రం చేశారు. అదేవిధంగా 1074 బావులు ఉండగా అందులో 633 బావులను పూడ్చేశారు.

పనిచేయని 355 బోర్‌వెల్స్ ఉండగా అందులో 274ని పూడ్చివేశారు. 3704 లోతట్టు ప్రాంతాలకుగాను 3370 చోట్ల మట్టివేసి లెవలింగ్ చేశారు. ఖమ్మం జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీల్లో 64 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉండగా 31 మరుగుదొడ్లను పూర్తి చేశారు. రోడ్డుపైకి మురికి నీరు వచ్చే ప్రాంతాలు 2,957 ఉండగా అందులో 2,767 చోట్ల మరమ్మతులు చేశారు. 11,008 ప్రాంతాలకుగాను 10,540 ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లి పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. 6,968 చోట్ల రోడ్లకు గుంతలు పడినట్లు గుర్తించి వాటిలో 6,028 చోట్ల గుంతలను పూడ్చివేశారు.

దుమ్ము దులుపుకున్న ప్రభుత్వాఫీసులు : పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ క్లీన్ చేశారు. ఖమ్మం జిల్లాలో 584 గ్రామాల్లో1317 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఇప్పటి వరకు 1,314 అంగన్ వాడీ కేంద్రాలను శుభ్రం చేశారు. అదేవిధంగా 694 ప్రాధమిక పాఠశాలలు ఉండగా 694 పాఠశాలలను, 191 ప్రాథమికోన్నత పాఠశాలలకు గాను 191, 189 హైస్కూళ్ళకుగాను 188, 242 ఆసుపత్రులకుగాను 240,192 కమ్యూనిటీ హాళ్ళకు గాను 187, ఇతర 631 ప్రభుత్వ భవనాలకు గాను 620 భవనాలను, 11 మార్కెట్ స్థలాలకు గాను 11 స్థలాలను శుభ్రం చేశారు. మొత్తం అన్ని గ్రామాల్లో 2,62,402 కుటుంబాలు తడి, పొడి చెత్త బుట్టలను ఉపయోగించడం లేదని గుర్తించారు.

వీరిలో 7,362 కుటుంబాలకు రెండు రకాల చెత్త బుట్టలను అందజేశారు. 4887.4 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను గుర్తించగా 59,779.5 కిల్లోల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్, కవర్స్ ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. 2747.35 కిలోల ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళను గుర్తించగా 15,478 కిలోల ప్లాస్టిక్ బాటిళ్ళను సేకరించారు. మరో 20,715 గ్లాస్ బాటిళ్ళను సేకరించారు.
బాగుపడ్డ విద్యుత్ వ్యవస్థ : పవర్ వీక్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో 584 గ్రామాల్లో విధీలైట్లకు సంబంధించి 9570 చోట్ల విద్యుత్ తీగలు వేలాడుతున్నట్లు గుర్తించి 6932 చోట్ల సరిచేశారు. అదేవిధంగా 3647 విద్యుత్ స్ధంబాలు దెబ్బతిన్నట్లుగా గుర్తించి అందులో 2035 స్థంబాలను మార్చేశారు. 3214 విద్యుత్ స్థంబాలు వంగి పోయినట్లుగా గుర్తించగా వాటిలో 2057 స్థంబాలను సరిచేశారు. మొత్తం 17606 విద్యుత్ స్ధంబాలను గుర్తించి అందులో 11,367 స్తంభాలను మార్చారు. మొత్తం గ్రామాల్లో 7112విద్యుత్ లైట్లు అవసరం ఉండగా 4481 చోట్ల బిగించారు. 1136 స్తంబాలను మార్చాల్సి ఉండగా 558 స్తంభాలను మార్చారు.

పచ్చని తోరణాలుగా మారిన గ్రామాలు : గ్రామాల్లో పరిశుభ్రత పనులు జోరుగా చేయడంతో పాటు హరితహారంలో భాగంగా విరివిరిగా మొక్కలను నాటారు. అంతేగాక హరితహారంలో భాగంగా 5,27,525 కృష్ణ తులసి మొక్కలు కావాలని ప్రజలు కోరగా ఇప్పటి వరకు 1,09,168 మొక్కలను పంపిణీ చేశారు. అంతేగాక 516 గ్రామాల్లో 2,27,255 కుటుంబాలకు ఇంటికి ఆరు మొక్కల చొప్పున 29,57,864 మొక్కలను పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామాల్లో రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లో మొక్కలను నాటేందుకు 6054 మంది రైతులకు 14,18,091 మొక్కలను పంపిణీ చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 438 గ్రామాల్లో 672.14 కి.మీ రోడ్డు సైడ్‌లో 2,84,960 మొక్కలను నాటారు. ఇంకా 158.5 కి.మీ దూరంలో 58,434 మొక్కలను నాటాల్సి ఉంది. అదేవిధంగా 7,304 చోట్ల సామూహికంగా 4,00,891 మొక్కలను నాటారు. ఇంకా 124 చోట్ల 13,945 మొక్కలను నాటాల్సి ఉంది.

అదేవిధంగా 346 ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థల్లో 1,25,432 మొక్కలను నాటారు. ఇంకా 13,961 మొక్కలను ఆయా సంస్థల్లో నాటాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో 584 గ్రామాల్లో ఇప్పటికే 516 గ్రామాల్లో నర్సరీలు ఉండగా కొత్తగా 68 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో 73 నర్సరీలు 306.7 ఎకరాల ప్రభుత్వ స్ధలాల్లోనే ఉన్నట్లు గుర్తించారు. ఇందులో1,89,39,429 మొక్కలను పెంచగాఅందులో 93,77,189 మొక్కలు ఎదిగాయి. అందులో 80,41,935 మొక్కలను పంపిణీ చేశారు. వచ్చే ఏడాదికిగాను 584 గ్రామ పంచాయతీలకుగాను 584 గ్రామాల్లో గ్రీన్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు. అయితే ఇందులో 518 గ్రామాల్లో ఇప్పటికే నర్సరీలు ఉన్నాయి.

ఇంకా 66 గ్రామాల్లో నర్సరీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో మొత్తం 2,18,53,307 మొక్కలను పెంచి 1,06,22,070 మొక్కలను విడుదల చేశారు. వీటిఓ 86,63,502 మొక్కను పంపిణీ చేశారు. ఇందులో ఇంటి అవసరాల నిమిత్తం 32,96,689 మొక్కలు, సంస్థల కోసం 46,152 మొక్కలు, రైతుల కోసం 23,16,774 మొక్కలు, చెరువులు, కాలువల పక్కన నాటేందుకు 4,09,188, ఇతర ప్రాంతాల కోసం 4,38,780 మొక్కలు, రహదారుల వెంట నాటేందుకు 1,29,238 మొక్కలు అవసరం ఉంది. మొత్తం 71,76,811 మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.

30 days special action plan that end

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మారిన గ్రామాల స్వరూపం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: