ప్రాణాలు నిలిపే మొక్క

    అందమైన పూలకోసమో పచ్చదనం కోసమో రకరకాల మొక్కల్ని పెంచుకుంటాం. కానీ ఈ మధ్య కాలుష్యాన్ని అరికట్టే మొక్కల్నే పెంచుకోవాల్సి వస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న వాతావరణ కాలుష్యానికి ఇంటిలోపలి విషవాయువులూ తోడై ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి. ఆ వాయువుల్ని పీల్చి పిప్పి చేసి, ఆరోగ్యంగా ఉంచే పచ్చని మొక్కే స్నేక్‌ప్లాంట్. మదర్ ఇన్ లా టంగ్… స్నేక్‌ప్లాంట్‌కి మరో పేరు. ఈ మొక్క ఆకుల ఆకారమూ అంచులూ సూదుల్లా ఉండటం వల్లే దానికాపేరు. టైగర్స్ టెయిల్, విమెన్స్ […] The post ప్రాణాలు నిలిపే మొక్క appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

అందమైన పూలకోసమో పచ్చదనం కోసమో రకరకాల మొక్కల్ని పెంచుకుంటాం. కానీ ఈ మధ్య కాలుష్యాన్ని అరికట్టే మొక్కల్నే పెంచుకోవాల్సి వస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న వాతావరణ కాలుష్యానికి ఇంటిలోపలి విషవాయువులూ తోడై ఆరోగ్యాన్ని హరించేస్తున్నాయి. ఆ వాయువుల్ని పీల్చి పిప్పి చేసి, ఆరోగ్యంగా ఉంచే పచ్చని మొక్కే స్నేక్‌ప్లాంట్. మదర్ ఇన్ లా టంగ్… స్నేక్‌ప్లాంట్‌కి మరో పేరు. ఈ మొక్క ఆకుల ఆకారమూ అంచులూ సూదుల్లా ఉండటం వల్లే దానికాపేరు. టైగర్స్ టెయిల్, విమెన్స్ టంగ్.. ఇలా రకరకాలుగానూ పిలుస్తుంటారు.

కాస్మోటిక్సూ ప్లాస్టిక్కు వస్తువులను ఈ మొక్క వార్నిష్‌లూ పెయింట్లూ, ధూమపానం.. వంటి వాటివల్ల ఇంట్లో విడుదలయ్యే బెంజీన్, ఫార్మాల్టిహైడ్, క్సైలీన్, టోలీన్.. వంటి క్యాన్సర్ కారక రసాయనాలూ తొలగిస్తుందని నాసా పరిశోధనల్లో తేలింది. ఈ మొక్కలో ఉండేవన్నీ ఆకులే కాబట్టి అత్యధికంగా ఆక్సిజన్‌ని విడుదల చేస్తుందని హార్వర్ట్ నిపుణులూ చెబుతున్నారు. దాంతో ఇది కాలుష్యాన్ని సమర్థవతంగా తగ్గించే మొక్కగా గుర్తింపు పొందింది. దీనివల్ల గాలి ద్వారా వ్యాపించే అలర్జీలూ తగ్గుతాయట.
ఇంట్లోనేకాదు, ఆఫీసుల్లో, తరగతి గదుల్లో కార్బన్‌డై ఆక్సైడ్ ఎక్కువగా విడుదలవడంతో మెదడూ, నరాల పనితీరు దెబ్బతింటుంది. తరచూ అలసటా, నీరసం, తలనొప్పీ వస్తుంటాయి. ఏకాగ్రత లోపిస్తుంది. కండరాల నొప్పులొస్తాయి. ఈ పరిస్థితినే సిక్ బిల్డింగ్ సిండ్రోమ్ అంటారు. అలాంటి చోట్ల స్నేక్‌ప్లాంట్‌లను పెంచితే గాలిలో కాల్యుష్యకారకాల శాతం తగ్గుతుంది.

 

Plants Receiveing More Pollution

 

 

The post ప్రాణాలు నిలిపే మొక్క appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.