ఎసిబి వలలో మైనింగ్ ఎడి, ఆర్‌ఐ

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ ప్రతినిధి : వనపర్తి జిల్లా కేంద్రంలోని మైనింగ్ ఎడి కార్యాలయంలో శుక్రవారం మైనింగ్ కాంట్రాక్టర్ నుండి రూ.20వేల లంచం తీసుకుంటూ మైనింగ్ ఎడి సామ్యూల్ జాకబ్, రాయల్టి ఇన్‌స్పెక్టర్ సాయిరాంలు మహబూబ్‌నగర్ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్‌పి ఫయాజ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు .. హైద్రాబాద్‌కు చెందిన మైనింగ్ కాంట్రాక్టర్ దిలీపాచారి వనపర్తి జిల్లా పరిధిలో క్వార్ట్‌క్వారీని లీజ్‌కు తీసుకున్నాడు. ఇటీవల దిలీపాచారి లీజ్ కాంట్రాక్ట్‌ను మరో ప్రాంతానికి బదిలీ […] The post ఎసిబి వలలో మైనింగ్ ఎడి, ఆర్‌ఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ ప్రతినిధి : వనపర్తి జిల్లా కేంద్రంలోని మైనింగ్ ఎడి కార్యాలయంలో శుక్రవారం మైనింగ్ కాంట్రాక్టర్ నుండి రూ.20వేల లంచం తీసుకుంటూ మైనింగ్ ఎడి సామ్యూల్ జాకబ్, రాయల్టి ఇన్‌స్పెక్టర్ సాయిరాంలు మహబూబ్‌నగర్ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఎసిబి డిఎస్‌పి ఫయాజ్ తెలిపిన సమాచారం మేరకు వివరాలు .. హైద్రాబాద్‌కు చెందిన మైనింగ్ కాంట్రాక్టర్ దిలీపాచారి వనపర్తి జిల్లా పరిధిలో క్వార్ట్‌క్వారీని లీజ్‌కు తీసుకున్నాడు. ఇటీవల దిలీపాచారి లీజ్ కాంట్రాక్ట్‌ను మరో ప్రాంతానికి బదిలీ చేయాలని మైనింగ్ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన మైనింగ్ ఎడి సామ్యూల్ జాకబ్, లీజ్‌క్వారీ దగ్గర అక్రమాలు జరిగాయని రూ. కోటి 18 లక్షలు ఫైన్ కట్టాలని నోటీసు జారీ చేశాడు. దీంతో మైనింగ్ కాంట్రాక్టర్ దిలీపాచారి మైనింగ్ అధికారుల దగ్గరికి వెళ్లి తాను ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. నోటీసుకు రిప్లై ఇస్తే మీకు సహాయం చేస్తానని మైనింగ్ ఎడి కాంట్రాక్టర్‌కు చెప్పి రూ. లక్ష 20వేల లంచాన్ని డిమాండ్ చేశారు. గత నెల 27న లక్ష రూపాయలు ఎడికి లంచంగా ముట్టజెప్పారు. మరో 20వేలు అర్జెంట్‌గా తీసుకొని శుక్రవారం వనపర్తిలోని తన కార్యాలయానికి రావాలని ఎడి చెప్పడంతో మైనింగ్ కాంట్రాక్టర్ దిలీపాచారి ఎసిబి అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం 20 వేల రూపాయలను మైనింగ్ కార్యాలయంలో ఎడి సామ్యూల్ జాకబ్, ఆర్‌ఐ సాయిరాంలకు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

 Two Mines Dept officials caught taking bribe

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎసిబి వలలో మైనింగ్ ఎడి, ఆర్‌ఐ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: