ఇండియాలో ఫెడరలిజం

  భారత రాజ్యాంగంలో ఫెడరలిజంకు సంబంధించిన అంశాలు అనేక ఆర్టికల్స్‌లలో, అనేక సందర్భాల్లో విస్తారంగా నిర్వచించబడ్డాయి. పేర్కొనబడ్డాయి. ఆచరణలో ఫెడరలిజం స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, అతిక్రమించినప్పటికీ, రాజ్యాంగంలో మాత్రం ఫెడరలిజం గురించి ఆదర్శవంతంగా మార్గదర్శకాలను పొందుపరచడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్రంపైకి తిరుగుబాట్లు చేయకుండా, దేశం నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకోకుండా ఉండేందుకు కేంద్రానికి బలమైన అధికారాలు కట్టబెట్టడం జరిగింది. 355, 356 ఆర్టికల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం రద్దు […] The post ఇండియాలో ఫెడరలిజం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత రాజ్యాంగంలో ఫెడరలిజంకు సంబంధించిన అంశాలు అనేక ఆర్టికల్స్‌లలో, అనేక సందర్భాల్లో విస్తారంగా నిర్వచించబడ్డాయి. పేర్కొనబడ్డాయి. ఆచరణలో ఫెడరలిజం స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, అతిక్రమించినప్పటికీ, రాజ్యాంగంలో మాత్రం ఫెడరలిజం గురించి ఆదర్శవంతంగా మార్గదర్శకాలను పొందుపరచడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్రంపైకి తిరుగుబాట్లు చేయకుండా, దేశం నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకోకుండా ఉండేందుకు కేంద్రానికి బలమైన అధికారాలు కట్టబెట్టడం జరిగింది. 355, 356 ఆర్టికల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేయవచ్చు అనే ఆర్టికల్ అందులో ఒకటి. కేంద్రీకృత అధికారం, కేంద్రీకృత అవినీతిని, నియంతృత్వాన్ని అనివార్యం చేస్తుందని, తత్వవేత్తలు సెలవిచ్చారు. వారు అన్నట్టుగానే కేంద్రం పలు సందర్భాల్లో ఫెడరలిజం స్ఫూర్తిని అతిక్రమిస్తూ, తన దండం ప్రయోగించింది.

కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు కలిగే సౌకర్యం ఇది. అందువల్ల యుపిఎ, ఎన్‌డిఏ ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు వాటిలో చేరిగాని, చేరకుండా బయటనే ఉండి ప్రత్యక్షంగా, పరోక్షంగా, తటస్థంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇవ్వడం జరుగుతూ వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు నిధులు ఇవ్వడంలో ఇంకా అనేక సందర్భాల్లో రాష్ట్రాలను నొక్కేస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అక్రమాలను, అవినీతిని అప్పుడే గుర్తుకు వచ్చినట్టు దాడులు చేయిస్తుంది. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ఫెడరలిజం భారత రాజ్యాంగంలో, దేశంలో, రాష్ట్రాల్లో ఎన్ని రూపాల్లో ఆచరణలో కొనసాగుతున్నదో, కొనసాగాల్సి ఉన్నదో చర్చించడానికి ఈ వ్యాసం పరిమితం. ఈ క్రింద పేర్కొన్న అంశాలు అన్నిటిలో ఫెడరలిజం ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో వీటిని ఏదో ఒక రూపంలో పేర్కొనడం జరిగింది. అవి:

1.రాష్ట్రాల అధికారులు.. పరిధులు.. పరిమితులు/ 2. కేంద్రం అధికారాలు.. పరిధులు పరిమితులు/ 3. ముఖ్యమంత్రుల, మంత్రివర్గాల పరిధులు..పరిమితులు / 4.జిల్లా పరిషత్‌ల పరిధులు.. పరిమితులు.. అధికారాలు/ 5. మున్సిపల్, కార్పొరేషన్ల అధికారాలు.. పరిధులు..పరిమితులు/6. మండల పరిషత్ అధికారాలు.. పరిధులు..పరిమితులు/7.గ్రామ పంచాయతీల అధికారాలు ..పరిధులు..పరిమితులు/8.జిల్లా కలెక్టర్ల అధికారాలు.. పరిధులు..పరిమితులు/9.జిల్లా కోర్టులో పరిధులు.. పరిమితులు/10.హైకోర్టుల పరిధులు.. పరిమితులు / 11.రాష్ట్రాల పోలీసుల పరిధులు.. పరిమితులు/12.కేంద్ర బలగాల అధికారాలు.. పరిధులు..పరిమితులు/ 13. సిబిఐ అధికారాలు..పరిమితులు/14.సుప్రీంకోర్టు అధికారాలు.. పరిమితులు/15. రాష్ట్రాలు పరస్పర ఒప్పందాలు.. పరిధులు.. /16. శాసనాలు చేయడంలో రాష్ట్రాల పరిధులు..పరిమితులు/17. శాసనాలు చేయడంలో కేంద్రం పరిధులు.. పరిమితులు../18.6,7,8,9,10,11,12 షెడ్యూళ్లు ఫెడరలిజం/

19. ఎస్‌సి, ఎస్‌టి, బిసిల జాబితాలు కేంద్రం రాష్ట్రాల పరిధులు..పరిమితులు/20. రాష్ట్రాల ఆదాయం.. పన్నులు వేసే అధికారాలు..పరిమితులు/21. శాంతి భద్రతలు రాష్ట్రాల అధికారాలు..పరిమితులు/22.గనులు.. ఖనిజాలు.. అటవీ సంప ద.. రాష్ట్రాల అధికారాలు..పరిమితులు /23.పరిశ్రమలు.. రాష్ట్రాల అధికారాలు పరిమితులు../24.వైద్యం ఆరోగ్యం.. రాష్ట్రాల అధికారాలు..పరిమితులు/25.విద్యారంగం రాష్ట్రాల అధికారాలు.. పరిమితులు/26. రేడియో, టివిలపై రాష్ట్రాల అధికారాలు.. పరిమితులు భారత రాజ్యాంగంలోని 11వ విభాగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల గురించి వివరంగా పేర్కొనడం జరిగింది. వాటిని సంక్షిప్తంగా చూద్దాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 245లో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికారాల పరిధిని వివరిస్తుంది. ఆర్టికల్ 246లో పార్లమెంటు శాసనాల పరిధిలోని అంశాలను తెలుపుతుంది. ఆర్టికల్ 246, 246ఎ వస్తువులు, సేవలు (జిఎస్‌టి) పన్నులకు సంబంధించిన అంశాలను తెలుపుతుంది.

247ఎ ఆర్టికల్‌లో అదనపు న్యాయస్థానాల ఏర్పాటును వివరిస్తుంది. ఆర్టికల్ 248 ద్వారా ఏ జాబితాలో లేని అంశాలపై పార్లమెంటుదే అధికారమని, స్పష్టం చేయడం జరిగింది. 249 ఆర్టికల్ రాష్ట్రాల జాబితాలోని అంశాలపై జాతీయ ప్రయోజనాల దృష్ట్యా, పార్లమెంటు శాసనాలు చేసే అధికారం కల్పిస్తుంది. 250 ఆర్టికల్ ఎమర్జెన్సీ అమలులో ఉన్నప్పుడు సర్వాధికారాలు పార్లమెంటుకు సంక్రమిస్తాయని పేర్కొనడం జరిగింది. 251 ఆర్టికల్‌లో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల చట్టాల మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు విధి విధానాలను సూచిస్తుంది. 252 ఆర్టికల్‌లో పార్లమెంటు రాష్ట్ర ప్రభుత్వాల కోరికను అనుసరించి రాష్ట్రాల అంశాలపై పార్లమెంటు చట్టం చేయవచ్చు అని తెలుపుతుంది. ఆర్టికల్ 254 కేంద్ర, రాష్ట్ర శాసనాల మధ్య వైరుధ్యం తుది అధికారం పార్లమెంటులో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 245లో రాష్ట్రపతి, గవర్నర్ అనుమతి పొందకపోయినా, కొన్ని శాసనాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొనడం జరిగింది.

ఆర్టికల్ 256లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలను పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 257లో రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని పేర్కొనడం జరిగింది. 257ఎ ఆర్టికల్‌లో సాయుధ బలగాలను రాష్ట్రం కోరికపై కేంద్రం పంపించడం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 258లో కేంద్ర అధికారాలను రాష్ట్రాలకు సంక్రమించే అంశాలను పేర్కొనడం జరిగింది. 258ఎలో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అంశాలను కేంద్రానికి అప్పగించడం పై సూచించడం జరిగింది. 260 ఆర్టికల్‌లో భారతదేశం వెలుపలగల భూభాగాలపై కేంద్ర ప్రభుత్వ అధికారం ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 261 ప్రభుత్వ శాసనాలు, రికార్డులు న్యాయపరమైన చర్యల గురించి పేర్కొంటుంది. ఆర్టికల్ 262లో అంతర్రాష్ట్ర నదీ జలాలను పరిష్కరించే విధానాన్ని పేర్కొనడం జరిగింది. రాష్ట్రాల సహకారం కోసం ఆర్టికల్ 263లో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటును వివరిస్తుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అంశాల విషయానికి వస్తే, ఆర్టికల్ 264, 265లు శాసనాలు చేయకుండా పన్ను విధించరాదని పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 266 ప్రభుత్వ ఖాతాల గురించి, సంచిత నిధి గురించి వివరిస్తుంది. 265 ఆర్టికల్ ఆపత్కాల నిధి గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 268లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయాల పంపిణీ గురించి వివరిస్తుంది. 268ఎ సేవలపై పన్ను గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపకాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 269లో కేంద్రం వసూలు చేసే పన్ను నుండి రాష్ట్రాలకు అందించాల్సిన వాటాల గురించి తెలుపుతుంది. 269ఎ ఆర్టికల్‌లో రాష్ట్రాల మధ్య వాణిజ్యంలో వస్తువుల సేవలపై పన్ను గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 270 కేంద్రం వసూలు చేసే పన్నులు, మొదలైన వాటిని రాష్ట్రాల పంపిణీ చేసే విధానం తెలుపబడింది. ఆర్టికల్ 271లో కొన్ని సుంకాలపై, పన్నులపై సర్ ఛార్జి విధించే అంశాన్ని వివరిస్తుంది.

ఆర్టికల్ 273లో జనుము ఉత్పత్తులపై ఎగుమతులకు బదులుగా సహాయకరంగా గ్రాంటులు ఇవ్వడాన్ని తెలుపుతుంది. ఆర్టికల్ 274లో రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి ఉన్న పన్నులకు సంబంధించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని తెలుపుతుంది. ఆర్టికల్ 275లో ఆయా రాష్ట్రాలకు కేంద్రం గ్రాంటు లేక సహాయం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 276లో వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, పన్ను విధించే అంశాలను తెలుపుతుంది. ఆర్టికల్ 277లో మినహాయింపుల గురించి పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 279లో నికర ఆదాయానికి నిర్వచనం ఇవ్వబడింది. 279ఎ లో జిఎస్‌టి పన్నుల గురించి కౌన్సిల్ ఏర్పాటు గురించి వివరిస్తుంది. 280 ఆర్టికల్ ఫైనాన్స్ కమిషన్ నియమించి కేంద్ర, రాష్ట్ర వాటాలను గురించి సూచనలు చేస్తుంది. 282 ఆర్టికల్‌లో ప్రజల ఉపయోగం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వడం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 283లో ప్రభుత్వ నిధులపై నియంత్రణ ఎలా ఉండాలో పేర్కొంది. ఆర్టికల్ 284లో రకరకాలుగా ప్రభుత్వ ఖజానాకు చేరే సొమ్మును ఎలా ఉపయోగించాలో తెలుపుతుంది. 285 ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వాల ఆస్తులపై రాష్ట్రాలు పన్ను విధించడానికి వీలు లేదని తెలుపుతుంది.

287 ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వ విద్యుత్ వినియోగం మీద, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించడానికి వీలు లేదని పేర్కొన్నది. 288 ఆర్టికల్ నీటి పన్ను, విద్యుత్ పన్ను, తదితరాలపై కేంద్రంపై పన్నులు విధించకూడదని మినహాయింపులను తెలిపింది. అట్లే ఆర్టికల్ 289లో రాష్ట్రాల వార్షిక ఆదాయంపై కేంద్రం పన్ను విధించే వీలు లేదని తెలుపుతుంది. 290 ఆర్టికల్ పెన్షన్ తదితర చెల్లింపులకు సంబంధించిన సర్దుబాట్లను వివరిస్తుంది. ఆర్టికల్ 290ఎలో కొన్ని దేవస్థానాలకు చెల్లింపుల గురించి తెలుపుతుంది. 291 ఆర్టికల్‌లో మాజీ సంస్థానాధీశులకు చెల్లింపులు వివరిస్తుంది. 1971లో 26వ రాజ్యాంగ సవరణతో ఇట్టి రాజ్యభరణాలను రద్దు చేయడం జరిగింది. ఇలా కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాలు, చట్టాలు శాంతి భద్రతలు ఆర్థికంగా ఎవరి వాటా వారికి, ఎవరి పరిధి వారికి నిర్దిష్ఠంగా పేర్కొనడం జరిగింది.

అంతిమంగా అన్నిట్లో కేంద్రం అధికార పరిధిని విస్తరించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 355, 356లలో రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్, కేంద్రం రద్దు చేసే గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కల్పిస్తుంది. ఇలా చివరకు కేంద్రమే సర్వాధికారాలు కలిగి ఉండే విధంగా ఫెడరల్ విధానం అమల్లో ఉన్నది. అమెరికాలో పూర్తిస్థాయి ఫెడరల్ విధానం కొనసాగుతున్నది. అలాంటి ఫెడరల్ విధానం ఇండియాలో కూడా అమలు చేయాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలకు మధ్య పార్టీలు వేరైనప్పుడు సంఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలను వందసార్లకు పైగా కేంద్రం, గవర్నర్ రద్దు చేయడం జరిగింది. ఇదీ కేంద్రం అధికారం. రాష్ట్రాల పరిమితి అని స్పష్టమవుతున్నది. ఓ సందర్భంలో ఎన్.టి. రామారావు కేంద్రం మిథ్య అన్నారు. కానీ ఇండియాలో ఫెడరలిజం నామమాత్రం అని పై ఆర్టికల్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

Federalism in India

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఇండియాలో ఫెడరలిజం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: