టీ కప్పులో పూలు!

  టీ కప్పులోకి పూలెలా వచ్చాయా అని ఆశ్చర్యపోతన్నారా ఈ బ్లూమింగ్ టీ రుచిని ఆస్వాదిస్తే మరింత ఆనందపడతారు. ఇదేదో కొత్త రకంలా ఉంది కదూ! తోటల నుంచి తెచ్చిన తేయాకుల్ని ఒకచోట పోగేసి అందులోంచి ఒకే సైజులో ఉండే ఆకుల్ని వేరు చేసి వాటికి చామంతి, గులాబీ, మల్లె… తదితర పూలను నూలు దారం సాయంతో జతచేసి రెండు వందల డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత దగ్గర వాటిని ఎండబెడతారు. వాటికే దానిమ్మ, పైనాపిల్, బ్లూబెర్రీలాంటి పండ్ల […] The post టీ కప్పులో పూలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టీ కప్పులోకి పూలెలా వచ్చాయా అని ఆశ్చర్యపోతన్నారా ఈ బ్లూమింగ్ టీ రుచిని ఆస్వాదిస్తే మరింత ఆనందపడతారు. ఇదేదో కొత్త రకంలా ఉంది కదూ! తోటల నుంచి తెచ్చిన తేయాకుల్ని ఒకచోట పోగేసి అందులోంచి ఒకే సైజులో ఉండే ఆకుల్ని వేరు చేసి వాటికి చామంతి, గులాబీ, మల్లె… తదితర పూలను నూలు దారం సాయంతో జతచేసి రెండు వందల డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత దగ్గర వాటిని ఎండబెడతారు. వాటికే దానిమ్మ, పైనాపిల్, బ్లూబెర్రీలాంటి పండ్ల ఫ్లేవర్లనూ జోడిస్తారు. ఇలా ఎండిపోయిన మొగ్గల్లా కనిపించే బ్లూమింగ్ టీ బడ్‌ను ప్యాక్ చేసి అమ్ముతారు. దాన్ని వేడి నీళ్లలో వేసి కాసేపు ఉంచితే పువ్వులా విచ్చుకుంటుంది.

పారదర్శకంగా ఉండే గాజు కెటిల్స్ లేదా కప్పుల్లో ఉంచి వీటిని అతిథులకు అందిస్తే ఎప్పటికీ మరచిపోలేని తేనేటి విందుగా గుర్తుండిపోతుంది. ఈ బ్లూమింగ్ టీ బడ్‌లను వాడాక తీసి ఫ్రిజ్‌లో పెట్టుకుని మరో రెండు మూడు సార్లు కూడా టీకి ఉపయోగించుకోవచ్చు. ప్రకృతి సిద్ధంగా వచ్చే పూలు, ఆకులూ, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో లభిస్తాయి. అందు లో జోడించే పూలూ పండ్లను బట్టి వాటి వాటి ప్రత్యేక ఔషధ గుణాలూ చేర తాయి. బ్లూమింగ్ టీ ఆరోగ్యంతోపాటు
కనుల విందు చేస్తుందన్నమాట.

 

Teacup Flower Centerpieces,teacup flower arrangement,teacup flower arrangement ideas,vintage teacup flower arrangement, teacup flower arrangements
Teacup Flower Centerpieces

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టీ కప్పులో పూలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.