కోయిల్‌సాగర్ కాల్వలో పడి ఇద్దరు గల్లంతు

  మహబూబ్‌నగర్ రూరల్ : మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చందాపూర్ గ్రామం వద్ద కోయిల్‌సాగర్ అప్రోచ్ కాల్వలో ప్రమాదవశత్తు పడి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం నీడుకుర్తి గ్రామానికి చెందిన బిమ్యానాయక్ కుమారుడు రోషన్ (8) 4వ తరగతి, మంగ్లినాయక్ కుమారుడు సచిన్ (13) 8వ తరగతులు చదువుతున్నారు. దసరా సెలువులు కావడంతో సరదాగా పక్కనే ఉన్న […] The post కోయిల్‌సాగర్ కాల్వలో పడి ఇద్దరు గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్‌నగర్ రూరల్ : మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం చందాపూర్ గ్రామం వద్ద కోయిల్‌సాగర్ అప్రోచ్ కాల్వలో ప్రమాదవశత్తు పడి ఇద్దరు విద్యార్థులు గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం నీడుకుర్తి గ్రామానికి చెందిన బిమ్యానాయక్ కుమారుడు రోషన్ (8) 4వ తరగతి, మంగ్లినాయక్ కుమారుడు సచిన్ (13) 8వ తరగతులు చదువుతున్నారు. దసరా సెలువులు కావడంతో సరదాగా పక్కనే ఉన్న కోయిల కొండ మండలం చందాపూర్‌కు చేరుకున్నారు.

అక్కడ ఉన్న కోయిల్‌సాగర్ కాల్వ దగ్గరకు చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారీ కాల్వలో పడిపోయా రు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగారు. దీనిని గమనించిన స్థానికులు సోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈత గాళ్లతో గాలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. చీకటి పడటంతో పోలీసులు వెనుతిరిగారు. ఇద్దరు పిల్లలు గల్లంతు కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆశోక్ తెలిపారు.

Two people fell into canal in Koilsagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కోయిల్‌సాగర్ కాల్వలో పడి ఇద్దరు గల్లంతు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: