గాంధీ కలలు కన్న పల్లెల ప్రగతిని నిర్మిద్దాం

  పల్లెలు బాగుటేనే దేశం బాగుంటుంది శ్రమ దానం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు చోట్ల బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి మహబూబ్ నగర్ : జాతీపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే పల్లెలు ప్రగతి బాటలో పయనించినప్పుడే సాధ్యమని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం పల్లెలో 30 రోజుల ప్రణాళికతో గ్రామ మౌళిక సదుపాయల కల్పనకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఆబ్కారి, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. బుధవారం […] The post గాంధీ కలలు కన్న పల్లెల ప్రగతిని నిర్మిద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పల్లెలు బాగుటేనే దేశం బాగుంటుంది
శ్రమ దానం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
పలు చోట్ల బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి

మహబూబ్ నగర్ : జాతీపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే పల్లెలు ప్రగతి బాటలో పయనించినప్పుడే సాధ్యమని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం పల్లెలో 30 రోజుల ప్రణాళికతో గ్రామ మౌళిక సదుపాయల కల్పనకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఆబ్కారి, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. బుధవారం మంత్రి నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్ద ఉన్న 150వ గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అహిం సా మార్గంలో స్వాతంత్రాన్ని గాంధీ సాధించిపెట్టారని గుర్తు చేశారు.

గాంధీ కలలు కన్న స్వరాజ్యం దిశగా తెలంగాణా ప్రభుత్వం ముం దుకు పోతుందని ఆయన చెప్పారు. అనంతరం మండల పరిధిలోని కోట కద్రలో మంత్రి,కలెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు.30 రోజుల పల్లె ప్రణాళికలో బాగంగా చేపట్టిన పనులను మంత్రి పరిశీలించారు. స్వీపరు పట్టి క్లీన్ చేసి ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా గతంలో తెలంగాణాలో జరగని అభివృద్ధ్ది ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని ఐదేళ్లలో అభివృద్ధ్ది పథంలో పయనించేలా చేశారన్నారు. సాగనీటి,తాగునీటి రంగాలతో పాటు విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.

రైతు లేనిదే రాజ్యం లేదని గతంలో అనేక మంది నేతలు చెప్పినప్పటికీ రైతుల కోసం చేసిందేమి లేదని చెప్పారు. తమ నేత కేసిఆర్ రైతులు ఆత్మగౌరవంగా జీవించాలన్న సంకల్పంతో రైతుల కోసం రుణమాఫి, రైతు బంధు,రైతు భీమా వంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి బాసటగా నిలిచాడన్నారు. పల్లెలు బాగుండాలన్న లక్షంతో ప్రభుత్వం 30 రోజుల ప్రణాళికతో ముందుకు పోతుందన్నారు. దీని వలన పల్లెలో పలు అభివృద్ద్ధి పనులు జరిగి ఆదర్శంగా మారనున్నాయన్నారు. ఇందులో ప్రతి ఒక్కరు బాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో , జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్.స్థానిక నేతలు, సర్పంచులు, జడ్‌టిసి, ఎంపిలు తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన మంత్రి:
మండల పరిధిలోని పోతన్ పల్లె, ధర్మాపూర్, బొక్కలోని పల్లె,అల్లీపూర్ గ్రామాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. తెలంగాణా సాంస్కృతికకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. బతుకుమ్మ పండుగతో ఆడపడుచులు అందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని దీవించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన పండుగను చేపడుతోందని, అందులో బాగంగానే అడపడుచులకు చీరలు పంపిణీ చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.మన రాష్ట్ర సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడించేలా ఘనవటీ జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఇతర అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Let us build village where Gandhi is dreaming

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గాంధీ కలలు కన్న పల్లెల ప్రగతిని నిర్మిద్దాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: