ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తానని ఏజెంట్ మోసం చేశాడు

  ఖమ్మం : ఎల్‌ఐసి పాలసీ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తానని చెప్పి డబ్బులు డిపాజిట్ చేయకుండా మధ్యవర్తి మోసం చేసాడంటూ బూర్గంపాడ్ మండలం సారపాక గాంధీనగర్‌కు చెందిన ముస్తఫా కన్నీటి పర్యాంతం అవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ముస్తఫా తన అమ్మాయి పెళ్ళికని 2010లో ఎల్‌ఐసి పాలసీ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం కోసం నాలుగు దఫాలుగా రూ. 85,000  మధ్యవర్తికి ఇచ్చానని తెలిపాడు. వీటికి సంబంధించిన రశీదులు కూడా ఉన్నాయని ఇప్పుడు అడిగితే డబ్బులు ఏమీ […] The post ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తానని ఏజెంట్ మోసం చేశాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం : ఎల్‌ఐసి పాలసీ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తానని చెప్పి డబ్బులు డిపాజిట్ చేయకుండా మధ్యవర్తి మోసం చేసాడంటూ బూర్గంపాడ్ మండలం సారపాక గాంధీనగర్‌కు చెందిన ముస్తఫా కన్నీటి పర్యాంతం అవుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ముస్తఫా తన అమ్మాయి పెళ్ళికని 2010లో ఎల్‌ఐసి పాలసీ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం కోసం నాలుగు దఫాలుగా రూ. 85,000  మధ్యవర్తికి ఇచ్చానని తెలిపాడు. వీటికి సంబంధించిన రశీదులు కూడా ఉన్నాయని ఇప్పుడు అడిగితే డబ్బులు ఏమీ రావు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని తన ఆవేదన వ్యక్తం చేశాడు. ముస్తఫా తన ఇంటి ముందు తాను దఫాలవారీగా కట్టిన డబ్బులను, సంబంధిత పాలసీ నెంబర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. నా డబ్బులు నాకు ఇప్పించాలని ముస్తఫా కన్నీటి పర్యాంతం అవుతున్నాడు.

Agent cheated that he would make Fixed Deposit

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయిస్తానని ఏజెంట్ మోసం చేశాడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: