వింత నిరసన

  సిరికొండ : రాంపూర్ గ్రామం నుండి సిరికొండ మండల కేంద్రానికి మద్యలో చిక్మన్ వాగు పైన బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఆ గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ నీటిలోనే ఉండి వింత నిరసన చేపట్టారు. వాగుపై బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు అధికారులకు ఎంపి, ఎమ్మెల్యేలకు సమస్యలను విన్నవించినా పరిష్కరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం మండల కేంద్రానికి పలు సమస్యలపై రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఎంపి, ఎమ్మెల్యేలు పలుమార్లు హామీలు ఇచ్చిన అవి […] The post వింత నిరసన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిరికొండ : రాంపూర్ గ్రామం నుండి సిరికొండ మండల కేంద్రానికి మద్యలో చిక్మన్ వాగు పైన బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఆ గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ నీటిలోనే ఉండి వింత నిరసన చేపట్టారు. వాగుపై బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు అధికారులకు ఎంపి, ఎమ్మెల్యేలకు సమస్యలను విన్నవించినా పరిష్కరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం మండల కేంద్రానికి పలు సమస్యలపై రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఎంపి, ఎమ్మెల్యేలు పలుమార్లు హామీలు ఇచ్చిన అవి హామీలుగానే మిగిలిపోతున్నాయి. తప్ప సమస్యకు మాత్రం పరిష్కారం అవుతలేదని వారు పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు ప్రజా ప్రతినిధులు తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తంబరె రేణుక, ఉప సర్పంచ్ ప్రహలాద్, టిఆర్‌ఎస్ నాయకులు గ్రామస్తులు విఠల్ పటేల్, బాలాజీ, నీలకంట్, మారుతి, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Villagers Protest that Bridge needs to be Built

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వింత నిరసన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: