‘తేడా రాయుడి’ఆగడాలు నిజమే

గంధసిరిలో ఆటవిక రాజ్యం గురువు ముసుగులో అరాచకత్వం శిరోముండనం చేయించడం, బింగీలు తీయించడం నిజమే! డేరాలతో వచ్చి డాన్ అయ్యాడు మీడియా ముందుకు వచ్చిన ‘తేడా రాయుడి’ బాధితులు ఖమ్మం : ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో గురువు ముసుగులో పస్తం సహదేవరాజు చేస్తున్న అరచకత్వాలు, మోసాలు నిజమేనని అతని బారినపడిన బాధితులంతా మీడియాముందుకు వచ్చారు. ఈ నెల 25న మన తెలంగాణ పత్రికల్లో ‘తేడా రాయుడు’ శీర్షికతో వచ్చిన వార్తకు ఆ గ్రామానకి చెందిన బాధితులతోపాటు […] The post ‘తేడా రాయుడి’ఆగడాలు నిజమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గంధసిరిలో ఆటవిక రాజ్యం
గురువు ముసుగులో అరాచకత్వం
శిరోముండనం చేయించడం, బింగీలు తీయించడం నిజమే!
డేరాలతో వచ్చి డాన్ అయ్యాడు
మీడియా ముందుకు వచ్చిన ‘తేడా రాయుడి’ బాధితులు

ఖమ్మం : ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో గురువు ముసుగులో పస్తం సహదేవరాజు చేస్తున్న అరచకత్వాలు, మోసాలు నిజమేనని అతని బారినపడిన బాధితులంతా మీడియాముందుకు వచ్చారు. ఈ నెల 25న మన తెలంగాణ పత్రికల్లో ‘తేడా రాయుడు’ శీర్షికతో వచ్చిన వార్తకు ఆ గ్రామానకి చెందిన బాధితులతోపాటు అతని కుటుంబసభ్యులు స్పందించి శనివారం ఖమ్మం ప్రెస్‌క్లబ్‌లో విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయుర్వేదం పేరుతో కల్తీ మందును ఇవ్వడం, పూజల పేరుతో నరబలి ఇవ్వడం, విదేశాల్లో తెలుగువారిని మోసం చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని బాధితులు వాపోయారు. ఏడాది క్రితం ముదిగొండ పోలీస్‌స్టేషన్లో కుల పంచాయతీలు పెట్టి ఇద్దరు యువకులకు శిరోముండనం చేసినట్లు కేసు కూడా నమోదైందని, కోయ్యంబత్తూర్‌లో కల్తీ మందు ఇచ్చినందుకు తమిళననాడు రాష్ట్రంలో కేసు నమోదైందని వారు వివరించారు.

కుల పెద్దమనుషుల పంచాయతీ పేరుతో ఆటవికంగా శిరోముండనం చేయించడం, బింగీలు తీయించడం, చెప్పు దెబ్బలతో కొట్టించడం, అశుద్ధం తినిపించడం, కుక్కుల బోన్‌లో వేసి హింసించడం, కుక్కలను రెచ్చగొట్టడం, తూపాకీతో బెదిరించడం అన్ని నిజమేనని వారు పేర్కొన్నారు. అతనిపై ఆరోపణలు చేసిన వారిలో స్వయంగా పస్తం రాంబాబు పెద్ద కొడలు పస్తం మావూళ్లమ్మ, అతని వియ్యంకుడు, వియ్యపురాలు సరిగిరి హుస్సేన్ ఉండటం గమనార్హం. లండన్, ఆస్ట్రేలియా దేశాలతోపాటు తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో ములికావైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని వారు వాపోయారు. అతని అర్థబలం, అంగబలంతో అందరినీ లోబరుచుకుని గ్రామంలో బుడగజంగాల కులం వారిపై పెత్తనం చేస్తున్నాడని బాధితులంతా కన్నీటిపర్యంతమయ్యారు.

బాధిత కుటుంబాల వారు తమ పిల్లలతో కలిసి సహదేవరాజు చేసిన అసాంఘిక, అనాగరికి చర్యలను వివరించారు.ఈ సందర్బంగా పస్తం బాజమ్మ మాట్లాడుతూ ‘నా భర్త తాగుబొతు కావటంతో అతన్ని చెప్పు చెతలో పెట్టుకున్నాడు. నలుగురు పిల్లలు కోసం అతని అరాచకాలను భరించాను. నాకు తవుడు పెట్టి దాన్నే తినమని అందరి ముందూ ధౌర్జన్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక ఒక రోజు ఉన్నట్టుండి పిల్లలను, నా సామాన్లు బయటపడేశాడు. 15 రోజుల పాటు అక్కడే ఓ చెట్టు కింద తలదాచుకున్నాం. ఇతరులు ఆశ్రయం కల్పించకుండా వారిని బెదిరించాడు. అడ్డుక్కొని ఆ రోజులు గడిపాను. చివరకు చనిపోద్దామని విషం అడిగినా చుట్టుపక్కల వారు పిల్లలతో ఇలా చేయటం సరికాదని వారించారు. ఇప్పటికీ నా భర్తను అతని గుప్పెట్లో పెట్టుకొని వేధిస్తున్నాడు. నాకు పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను’ నా భర్తను గురూజీ బందీ నుంచి విమూక్తి చేయాలని ఆమె కోరారు.

మరో బాధితురాలు సింగారజు అంజమ్మ మాట్లాడుతూ ‘నా భర్తను తనకు, పిల్లలకు కాకుండా దూరం చేశాడు. నాతో పాటు అనేక మంది బాధితుల భర్తలు సంపాదించిన సొమ్ముతో గురూజీగా చెప్పుకుండా జల్సాలు చేస్తున్నాడు. అతనికి సన్నిహితంగా ఉండే మగవారికి మందు, విందు అందజేస్తుండటంతో వారు అతనికి అండగా ఉంటున్నారు. రెండు వారాల కిందట అదనపు డిసిపి పూజ మేడమ్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. ఆమె తగు చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కాని ఇంత వరకు నాకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. ఇక పస్తం మావుళ్లమ్మది మరో విషాదం. ఆమె స్వయానా గురూజీ కోడలు, పెద్ద కొడుకు భార్య. మామగారి చేష్టల గురించి అతనను తనను పెట్టిన హింస గురించి ఏకరవుపెట్టింది. తనకు గుండు కొట్టించాడని, అశుద్ధం తినిపించే ప్రయత్నం చేశాడని ఆమె వివరించారు.

తన పిల్లలను, భర్తను తనకు అప్పగించాలని అందు కోసం తాను ఎక్కడకి వెళ్లడానికైనా ఎవరికి ఫిర్యాదు చేయడానికైనా వెనుకాడేది లేదని తెలియజేశారు. ఐదు సంవత్సరాల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. భర్త, ముగ్గురు పిల్లలను మచ్చిక చేసుకొని నాపై లేని, పోని అభాండాలు వేసి వేధిస్తున్నారు. అండగా నిలిచిన నా సోదరులను బెదిరిస్తున్నారుని ఆమె వాపోయింది సహదేవరాజు వియ్యంకుడు, వియ్యపురాలు సరిగిరి హుస్సేన్ మాట్లాడుతూ ‘నా కుమార్తె ఇచ్చి వివాహం చేశాను. కొద్దికాలం మంచిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి సహదేవరాజు వికృతచేష్టలు భరించలేకపోతున్నాం. తమన చంపుతామని బెదిరించాడని అతని మాట మాత్రమే సాగాలన్నది అతని నైజం అని పేర్కొన్నారు.

కాటి కాపరి, డేరాలతో వచ్చి మూలికవైద్యం ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేసి డాన్ అయ్యాడని మండిపడ్డారు. లైసెన్స్ తుపాకీ తీసుకొని అతని వ్యతిరేకులను బెదిరిస్తున్నాడని మండపడ్డారు. ఇంటి వద్ద సీసీ కెమెరాలు, కుక్కుల ఏర్పాటు చేశాడని ఆరోపించారు. అతని తిక్క తీర్పుల పరంపరను కొనసాగకుండా చట్టపరమైన చర్య తీసుకోవాలని బాధితులంతా ముక్త కంఠంతో వేడుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికైన జిల్లా అధికారులు స్పందించకుంటే అతని అరాచకాలపై పోలీసు రాష్ట్ర డీజీపీ, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలియజేశారు.

Scams in the name of Ayurveda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘తేడా రాయుడి’ఆగడాలు నిజమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: