తక్షణమే విద్యావాలీంటర్ల గౌరవ వేతనం

మన పల్లె బడి..మన ధర్మ నిధికి శ్రీకారం అభివృద్దిపై అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మెదక్: విద్యావాలీంటర్ల గౌరవ వేతనం వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ హేమలతశేఖర్‌గౌడ్ అద్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన గ్రామా ల పరిశుభ్రత వంటి […] The post తక్షణమే విద్యావాలీంటర్ల గౌరవ వేతనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన పల్లె బడి..మన ధర్మ నిధికి శ్రీకారం
అభివృద్దిపై అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలి
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

మెదక్: విద్యావాలీంటర్ల గౌరవ వేతనం వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ హేమలతశేఖర్‌గౌడ్ అద్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన గ్రామా ల పరిశుభ్రత వంటి అంశాలతో గాంధీజీ కళలు కెసిఆర్ నిజం చేస్తున్నారని మరోమారు పేర్కొన్నారు. విద్యావ్యవస్థను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మన పల్లెబడి, మన ధర్మనిధి కార్యక్రమా న్ని చేపట్టామని, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. వెంటనే మంత్రి స్పందించి మన పల్లె బడి…మన ధర్మనిధి కార్యక్రమానికి తనవంతుగా లక్ష రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించడంతో సభలో 11లక్షల 5వేల రూపాయలు విరాళాలు ప్రకటించారు.

మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంధాలయం స్వంత భవనం లేక ఇబ్బందులకు గురవుతున్నామని జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రాగౌడ్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 30రోజుల ప్రణాళిక మెద క్ జిల్లాలో ముందుకువెళ్లడం సంతోషంగా ఉంద ని హార్షం వ్యక్తంచేశారు. పంచాయతీ అధికారి తో ప్రజాప్రతినిధులు ప్రణాళికలకు రూపకల్పన చేసుకోవాలని అధికారులకు సూచించారు. మండల స్థాయిలో మండల పరిషత్ సమావేశానికి అధికారులు హాజరై సమస్యను తీరిస్తే జిల్లా పరిషత్ సమావేశంలో ఏలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా అధికారులకు సూచించారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారని హవేళిఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, ఎంఎల్‌సి శేరి సుభాష్‌రెడ్డి, జడ్‌పి సిఇఒ లక్ష్మీబాయి, జిల్లా పరిషత్ ఎఒ కరుణశీల, జెసి నగేష్, డిసిఒ హనో క్, డిఎఫ్‌ఒ పద్మజారాణి, ఆయా మండలాల జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Harish Attended Zilla Parishad General Body Meeting

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తక్షణమే విద్యావాలీంటర్ల గౌరవ వేతనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: