సోనాక్షి సిన్హా ఓ ధన పశువు: యుపి మంత్రి

  లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి సునీల్ భరాలా ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను ధన పశువుగా అభివర్ణించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి గత వారం ప్రసారం కాగా అందులో రామాయణానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సోనాక్షి సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో యుపి మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంక్షేమ మండలి చైర్మన్‌గా ఉన్న సునీల్ భరాలా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సోనాక్షి సిన్హా […] The post సోనాక్షి సిన్హా ఓ ధన పశువు: యుపి మంత్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి సునీల్ భరాలా ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను ధన పశువుగా అభివర్ణించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహించే టీవీ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి గత వారం ప్రసారం కాగా అందులో రామాయణానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సోనాక్షి సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో యుపి మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంక్షేమ మండలి చైర్మన్‌గా ఉన్న సునీల్ భరాలా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సోనాక్షి సిన్హా లాంటివారికి నేర్చుకునే సమయం ఉండదని, కేవలం వారికి ధన సంపాదనే లక్ష్యమని విమర్శించారు. సెప్టెంబర్ 20న ప్రసారమైన కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో రామాయణంలో నుంచి ఒక ప్రశ్నను అడుగుతూ హనుమంతుడు సంజీవని మూలికను ఎవరి కోసం తెచ్చాడు అని అడిగారు. నాలుగు ఆప్షన్లుగా సుగ్రీవుడు, లక్ష్మణుడు, సీత, రాముడు పేర్లు ఇవ్వగా సమాధానం చెప్పలేకపోయిన సోనాక్షి సమాధానం కోసం లైఫ్‌లైన్ వాడుకోవడం నెటిజన్ల నుంచి విమర్శలకు దారితీసింది.

 

UP minister calls Sonakshi Sinha a ‘dhan pashu’, he says ‘All they care about is earning money’

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సోనాక్షి సిన్హా ఓ ధన పశువు: యుపి మంత్రి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: