సిఎంల సమావేశంపై ఆ వార్తలు రాయొద్దు….

  హైదరాబాద్: గోదావరి జలాలను తరలింపు ద్వారా సాగర్ కుడి కాల్వ కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయలసీమ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై ఎపి సిఎం జగన్, తెలంగాణ సిఎం కెసిఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారని ఎపి సిఎం కార్యాలయం తెలిపింది. పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలను చర్చించారని వెల్లడించింది. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీస్ కానిస్టేబుళ్లకు ఎపిలో కూడా శిక్షణ ఇచ్చే […] The post సిఎంల సమావేశంపై ఆ వార్తలు రాయొద్దు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: గోదావరి జలాలను తరలింపు ద్వారా సాగర్ కుడి కాల్వ కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయలసీమ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై ఎపి సిఎం జగన్, తెలంగాణ సిఎం కెసిఆర్ సుదీర్ఘ చర్చలు జరిపారని ఎపి సిఎం కార్యాలయం తెలిపింది. పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలను చర్చించారని వెల్లడించింది. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీస్ కానిస్టేబుళ్లకు ఎపిలో కూడా శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందని పేర్కొంది. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టి పెట్టారని తెలియజేసింది. ఇలాంటి సమావేశం మీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరమని మండిపడింది. ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎపి సిఎం కార్యాలయం తెలిపింది. కేంద్రంపై తెలుగు రాష్ట్రాల సిఎంల అసంతృప్తి అంటూ ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక కథనం కల్పితమని, ఎపి తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశం ఏదీ ప్రస్తావనకు రాలేదని తెలిపింది. 

 

Fake News on Jagan KCR Meeting

The post సిఎంల సమావేశంపై ఆ వార్తలు రాయొద్దు…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: