2,960 తూములు

గొలుసుకట్టు చెరువులను నింపే కార్యక్రమంలో భాగంగా నిర్మాణం మన తెలంగాణ/హైదరాబాద్: మంజూరైన తూముల పనులన్నీ క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయి. తూముల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి, ప్రాజెక్టుల కాలువల ద్వారా నీరిందించే క్రమంలో గొలుసుకట్టు చెరువులను నింపాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం మేరకు ఇరిగేషన్ శాఖ ఈ దిశగా కసరత్తు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2960 చోట్ల తూములు నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందులో 2756 తూములకు ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు ఇవ్వగా అన్ని పనులు ప్రారంభం కావడం […] The post 2,960 తూములు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గొలుసుకట్టు చెరువులను నింపే కార్యక్రమంలో భాగంగా నిర్మాణం

మన తెలంగాణ/హైదరాబాద్: మంజూరైన తూముల పనులన్నీ క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యాయి. తూముల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి, ప్రాజెక్టుల కాలువల ద్వారా నీరిందించే క్రమంలో గొలుసుకట్టు చెరువులను నింపాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం మేరకు ఇరిగేషన్ శాఖ ఈ దిశగా కసరత్తు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2960 చోట్ల తూములు నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందులో 2756 తూములకు ప్రభుత్వం పాలనా పరమైన అనుమతులు ఇవ్వగా అన్ని పనులు ప్రారంభం కావడం విశేషం. ఇందులో 310 తూముల పనులు వంద శాతం పూర్తి కాగా, 1600 తూముల పను లు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ 1600 తూముల్లో షట్టర్ల నిర్మాణం మినహా, మిగతా అన్ని పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రభుత్వం అనుమతించిన తూముల్లో శ్రీరాంసాగర్ మొదటి దశ కింద 804 తూములు ఉండగా, రెండో దశలో 309 తూములు ఉన్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో 162 తూములు ఉండగా, కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో 237 తూములు, నెట్టెంపాడు 68, భీమా పరిధిలో 168 తూములు ఉన్నాయి. ఇదేవిధంగా దేవాదుల కాలువల పరిధిలో 113, ఎఎంఆర్‌పి ఎస్‌ఎల్‌బిసి పరిధిలో 41 తూములు ఉన్నాయి.

ఇదేవిధంగా సింగూరు కాలువలపైన 67 తూములు, వరద కాలువ తూములపై 43, ఎల్లంపల్లి కెనాళ్లపై 15 తూముల నిర్మాణం ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యధికంగా 832 తూములు ఉన్నయి. వీటి ద్వారా సుమారు 1444 చెరువులు నింపవచ్చని అధికారులు అంచనా వేశారు. వీటి ఆయకట్టు 87100 ఎకరాలు. కేవలం కాళేశ్వరం కాలువలకు తూములు ఏర్పాటు చేసి, చెరువులకు మళ్లించడం ద్వారా అదనంగా 87100 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించినట్లు అవుతుంది. గతంలో కాళేశ్వరంలో చెప్పిన ఆయకట్టుకు ఇది అదనం. వరద కాలువపై 43 తూములు నిర్మించగా, ఎల్లంపల్లి కెనాల్‌పై 15 తూములు నిర్మించారు. అయితే కాళేశ్వరం లింక్ 1, లింక్ 2 సక్సెస్ అయి వస్తున్న నీటితో తొలి ఫలితంగా ఈ తూములకే నీటిని సరఫరా చేశారు. వరద కాలువ వరకు చేరిన నీటితో 43 తూములు తెరిచి, చెరువులు నింపిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా ఎల్లంపల్లి కెనాల్‌పై నిర్మించిన 15 తూములు సైతం తెరిచి, చెరువులు నింపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో సైతం ప్రకటించారు. ఈ చెరువులు నిండి, గొలుసుకట్టు ద్వారా మరికొన్ని చెరువులు నిండాయి. మొత్తానికి ప్రభుత్వం ఈ సీజన్లో ఆరంభించిన తూముల నిర్మాణం ఫలితాలు ఇప్పటికే కొంత మంది రైతులకు అందాయి. కాళేశ్వరం సహా ఇతర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల కాలువల్లో నీరు ప్రవహించే క్రమంలో తూముల నుంచి చెరువులు నింపుతారు.

Ts govt wants build 2960 Thumulu

The post 2,960 తూములు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: