మెట్రో విషాదంపై విచారణ

ఇంజినీరింగ్ నిపుణులతో జరిపించాలి, నాణ్యత, భద్రత అంశాలను తనిఖీ చేయాలి : కెటిఆర్ 20లక్షల పరిహారానికి ఎల్&టి సుముఖత మన తెలంగాణ/హైదరాబాద్: అమీర్‌పేటలో మెట్రోపిల్లర్ పైనుంచి పె చ్చులు ఊడి పడి మహిళ మృతిచెందిన ఘటనపై మంత్రి కెటిఆర్ సీరియస్ అ య్యారు. ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ జరిపించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణాలు, వసతులను పరిశీలించాలని ఆయన మెట్రో అధికారులకు సూచించారు. […] The post మెట్రో విషాదంపై విచారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇంజినీరింగ్ నిపుణులతో జరిపించాలి, నాణ్యత, భద్రత అంశాలను తనిఖీ చేయాలి : కెటిఆర్
20లక్షల పరిహారానికి ఎల్&టి సుముఖత

మన తెలంగాణ/హైదరాబాద్: అమీర్‌పేటలో మెట్రోపిల్లర్ పైనుంచి పె చ్చులు ఊడి పడి మహిళ మృతిచెందిన ఘటనపై మంత్రి కెటిఆర్ సీరియస్ అ య్యారు. ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ జరిపించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణాలు, వసతులను పరిశీలించాలని ఆయన మెట్రో అధికారులకు సూచించారు. ప్రయాణికుల భద్రతకు మెట్రో స్టేషన్లలో పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలని, అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్య త ఇవ్వాలని కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. అనుకోని ప్రమాదమే అయినప్పటికీ, దీనిని తీవ్రంగా పరిగణిం చాల్సిన అంశమని కెటిఆర్ వ్యాఖ్యానించా రు. నాణ్యత, భద్రతా అంశాల్లో హైదరాబాద్ సాధించిన ఖ్యాతిని ‘మెట్రో’ కొనసాగించాలని కెటిఆర్ సూచించారు. మౌనిక మృతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ జరిపించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, ప్రయాణికుల రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మెట్రో అధికారులకు కెటిఆర్ దిశానిర్ధేశం చేశారు.
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
దీంతో దిగొచ్చిన అధికారులు మౌనిక కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల పరిహారంతో పాటుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ఎల్ ఎండ్ టి సుముఖత వ్యక్తం చేసినట్టు మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. వర్షం నుంచి తడవకుండా ఉండేందుకు మౌనిక అనే వివాహిత అమీర్‌పేట్ మెట్రో పిల్లర్ కిందకు వెళ్లిన సమయంలో పైనుంచి పెచ్చులు ఊడి నేరుగా ఆమె తలపై పడ్డాయి. పెచ్చుల ధాటికి తీవ్ర రక్తస్రావం కావడంతో మౌనిక అక్కడిక్కడే కుప్పకూలి మృతిచెందిన విషయం తెలిసిందే. మౌనిక స్వస్థలం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాగా, ఆమెకు కంతాల హరికాంత్ రెడ్డితో ఏడాది క్రితం పెళ్లి జరిగింది.
ఎల్ అండ్ టి సంస్థపై కేసు నమోదు
అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద ప్రమాదవశాత్తు యువతి మృతి చెందిన సంఘటనపై సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎల్ అండ్ టి సంస్థపై సోమవారం కేసు నమోదు అయ్యింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్ర కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌కు రైలులో వచ్చిన మౌనిక స్టేషన్‌లో దిగిన ఆమె వర్షం కారణంగా సెల్లార్ కింద నిలబడి ఉండగా ఆమె తల పై ఒక్కసారిగా మెట్రో స్టేషన్ గోడ పెచ్చులు ఊడి పడగా మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే మృతురాలి భర్త హరికాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు కోణాల్లో పోలీసులు విచారణ జరిపి, నిర్మాణ సంస్థ నిర్లక్షం కారణంగానే మౌనిక (26) మృతి చెందినట్లు పోలీసులు ఎల్ అండ్ టి పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తునట్లు పోలీసులు తెలిపారు.

Woman dies at Hyderabad Ameerpet metro station

 

The post మెట్రో విషాదంపై విచారణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: