బాలాకోట్‌తో పుంజుకున్న ఉగ్రమూకలు

  500 మందితో దండు సిద్ధం మరో సైనిక చర్యకు ఆర్మీచీఫ్ సంకేతాలు నిఘా సమాచారంతో మరింత జాగ్రత్త చెన్నై: పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు తిరిగి పుంజుకున్నాయని భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యగా బాలాకోట్‌లోని టెర్రర్ క్యాంపులను భారత సైన్యం ఏడు నెలల క్రితం దెబ్బతీసింది. అయితే ఇటీవలి కాలంలో ఈ క్యాంపుల కాంప్లెక్స్ తిరిగి సందడిగా మారిందని రావత్ చెప్పారు. […] The post బాలాకోట్‌తో పుంజుకున్న ఉగ్రమూకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

500 మందితో దండు సిద్ధం
మరో సైనిక చర్యకు ఆర్మీచీఫ్ సంకేతాలు
నిఘా సమాచారంతో మరింత జాగ్రత్త

చెన్నై: పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు తిరిగి పుంజుకున్నాయని భారత సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యగా బాలాకోట్‌లోని టెర్రర్ క్యాంపులను భారత సైన్యం ఏడు నెలల క్రితం దెబ్బతీసింది. అయితే ఇటీవలి కాలంలో ఈ క్యాంపుల కాంప్లెక్స్ తిరిగి సందడిగా మారిందని రావత్ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇండియాలోకి చొరబడేందుకు ఇక్కడ 500 మంది ఉగ్రవాదులు కాచుకుని ఉన్నారని తెలిపారు. భారత్‌లో దాడులకు దిగేందుకు వీరు శిక్షణ పొందినట్లు సమాచారం అందిందని ఆయన వెల్లడించారు. ఇక్కడి సైనిక విభాగపు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఆర్మీ చీఫ్ విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు ఆయన ఇక్కడ యంగ్ లీడర్స్ ట్రైనింగ్ వింగ్‌ను ప్రారంభించారు.

నిఘా వర్గాల నుంచి తమకు అందిన సమాచారంతో ఉగ్రవాదులు తిరిగి బాలాకోట్‌లో సమీకరణకు దిగినట్లు తెలిసిందని, ఇంతకు ముందు భారతీయ వైమానిక దళం చర్యకు దిగడంతో దెబ్బతిన్న స్థావరానికి తిరిగి జనాలను రాబట్టారని రావత్ తెలిపారు. బాలాకోట్‌లో కదలికలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు, అవసరం అయిన అదనపు బలగాలను సిద్ధం చేసుకుని ఉన్నట్లు, ఇక ముందు బాలాకోట్ స్థావరాలపై మరింత గట్టి దెబ్బకు దిగగలమని హెచ్చరించారు. అవసరాన్ని బట్టి బాలాకోట్ పై చర్య ఉంటుందన్నారు. ఇందులో తటపటాయింపులు అంటూ ఏమీ ఉండవన్నారు. సరిహద్దులలో నుంచి చొరబాట్ల కట్టడిపై దృష్టి సారించినట్లు, వాతావరణ పరిస్థితినిబట్టి చొరబాట్లు ఉంటాయని, ఇప్పుడు మంచు కరిగే దశ కావడంతో ఉత్తరం నుంచి అక్రమంగా చొచ్చుకు వచ్చేందుకు ఉగ్రవాదులు యత్నిస్తారని తెలిపారు. పశ్చిమ సరిహద్దుల వెంబడి అదనపు సైన్యాన్ని దింపినట్లు రావత్ చెప్పారు. ఈ సరిహద్దు రేఖలు సరిగ్గా ఖరారు కాలేదనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలన్నారు.

జమ్మూ కశ్మీర్ దిగ్బంధం వట్టిమాటనే
జమ్మూ కశ్మీర్‌లో తీవ్ర ఆంక్షలు ఉన్నాయనే వాదన సరికాదని ఆర్మీచీఫ్ స్పష్టం చేశారు. అక్కడేదో జరుగుతోంది. అందరి దిగ్బంధనం సాగుతోందని చెప్పడం బూటకమే అని , ఉగ్రవాద శక్తులే ఇటువంటి దుష్ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. వివిధ ప్రాంతాలలో దుకాణాలను ఉగ్రవాదులే భయపెట్టి మూసివేయిస్తున్నారని, వారికి భయపడి దుకాణాదార్లు ముందటి తలుపులు మూసివేసి, వెనుక నుంచి తీసి సరుకులు అమ్ముతున్నారని వెల్లడించారు. ప్రజలు సాధారణంగానే ఇక్కడికి వచ్చి సరుకులు కొనుక్కుని వెళ్లుతున్నారని తెలిపారు. శ్రీనగర్ శివార్లలో ఇటుకబట్టీలు బాగానే నడుస్తున్నాయని, రోజుకు వందకు పైగా ఆపిల్ పండ్ల ట్రక్కులు రవాణా అయి వెళ్లుతున్నాయని చెప్పారు. ఫోన్లు సరిగ్గానే పనిచేస్తున్నాయని అన్నారు. ఏం చేయాలో తెలియని స్థితిలోనే కొన్ని శక్తులు అక్కడ పరిస్థితి బాగా లేదని ప్రచారానికి దిగుతున్నాయని ఆర్మీ చీఫ్ తెలిపారు.

500 Terrorists Waiting to Infiltrate Into India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాలాకోట్‌తో పుంజుకున్న ఉగ్రమూకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: