నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

  30వ తేదీ వరకు చీరల పంపిణీ కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్‌లో 15.41 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు ప్రారంభించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వీడియో కాన్ఫరెన్స్‌లో జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ మహానగరంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నేడు పశుసంవర్దక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు. సోమవారం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొంటూ ముందుగా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేటలోని మల్టీఫర్పస్ ఫంక్షన్‌హాల్, అమీర్‌పేట వివేకానంద కమ్యూనిటీహాల్, అంబర్‌పేట మహారాణా ప్రతాప్ […] The post నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

30వ తేదీ వరకు చీరల పంపిణీ కార్యక్రమం

గ్రేటర్ హైదరాబాద్‌లో 15.41 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు

ప్రారంభించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్

వీడియో కాన్ఫరెన్స్‌లో జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్

మహానగరంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నేడు పశుసంవర్దక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు. సోమవారం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొంటూ ముందుగా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేటలోని మల్టీఫర్పస్ ఫంక్షన్‌హాల్, అమీర్‌పేట వివేకానంద కమ్యూనిటీహాల్, అంబర్‌పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్‌హాల్, గోషామహల్ నియోజకవర్గ పరిధిలో అబిడ్స్ ఫంక్షన్‌హాల్‌లో మంత్రి బతుకమ్మ చీరలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 15.41 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలను మంగళవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డిఎస్ లోకేష్‌కుమార్ వెల్లడించారు. బతుకమ్మ చీరల పంపిణీ, ఆస్తిపన్ను వసూళ్ళు, శానిటేషన్ నిర్వహణ, భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు మరమ్మతులు తదితర అంశాలపై సోమవారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో 15. 41 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలను మంగళవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ డిఎస్ లోకేష్‌కుమార్ వెల్లడించారు. బతుకమ్మ చీరల పంపిణీ, ఆస్తిపన్ను వసూళ్ళు, శానిటేషన్ నిర్వహణ, భారీ వర్షాల నేపథ్యంలో రహదారులు మరమ్మత్తులు తదితర అంశాలపై సోమవారం జోనల్, డిప్యూటీ కమిషర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిహెచ్‌ఎసి ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, విభాగ అధిపతులు,చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ సిటీ ప్లానర్లు ఈ సమావేశానికి హజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మంగళవారం నుంచి ప్రా రంభిచనున్న చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి నిధులందరినీ భాగస్వామ్యం చేయలని ఆదేశించారు. సంబంధిత సర్కిళ్ళ వారీగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆహార భద్రత కార్డు ఉన్న అర్హులైన ప్రతి ఒక్క మహిళకు బతుకమ్మ చీరలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

నగర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని మరో రెండు రోజు లు పాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో పాటు ఈ నెలాఖరులో వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా నగరంలో గార్బెజ్‌ను వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ,గార్బెజ్ తొలగింపుకు అక్టోబర్ నుంచి అదనపు వాహహనాలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆస్తిపన్ను బకాయిల వసూళ్ళు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రూ. 3 లక్షలను ఆస్తిపన్నుగా చెల్లించే భవనాలకు రీ అసెస్‌మెంట్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వీటితో పాటు ట్రేడ్‌లైసెన్స్ రెన్యువల్‌పై దృష్టి సారించాలన్నారు.

భవన నిర్మాణ అనుమతలకు వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి అనుమతులను జారీ చేయాలని ఆదేశించారు. నో స్మోకింగ్ ప్రదేశాలపై నగర వాసులను చైతన్యం చేసేందుకు ప్రత్యేక సమావేశాల నిర్వహించాలన్నారు. నగరంలో సీజనల్, డెంగ్యూ వ్యాధి నివారణలో భాగంగా దోమల నివారణ మందు ఫాగింగ్ ,స్పేయింగ్‌లను రెట్టింపు చేయాలని కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమం అదనపు కమిషనర్లు శృతి ఓజా, సిక్తాపట్నాయక్, కెనడీ, విజయలక్ష్మి, విజిలెన్స్ డైరక్టర్ విశ్వజిత్ కంపాటి, చీఫ్ ఇంజనీర్లు సురేష్, జియాఉద్దిన్ తదితరుల పాల్గొన్నారు.

సర్కిళ్ళ వారీగా వివరాలు ఇవే…
కాప్రా 14480, ఉప్పల్ 9960, హయత్‌నగర్ 11400, ఎల్‌బినగర్ 39121, సరూర్‌నగర్ 18500, మలక్‌పేట 94877, సంతోష్‌నగర్ 107387, చంద్రాయణగుట్ట 61114, చార్మినార్ 32998, ఫలక్‌నుమా 33132, రాజేంద్రనగర్ 72751, మెహదీపట్నం 30000, కార్వాన్, 25000, గోషామహాల్, 5000, ముషీరాబాద్ 16000, అంబర్‌పేట, 42000, ఖైరతాబాద్ 8000, జూబ్లీహిల్స్, 2250, యూసఫ్‌గూడ, 55000, గచ్చిబౌలీ, 21400, చందానగర్ 15005, ఆర్‌సిపురం, 29325,మూసాపేట, 64104, కూకట్‌పల్లి 63825, కుతుల్లాపూర్, 64926, గాజుల రామారం, 62755, అల్వాల్ 7200, మల్కాజిగిరి 49920, సికింద్రాద్ 13929 బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రారంభించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
మహానగరంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నేడు పశుసంవర్దక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభిస్తారు. సోమవారం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొంటూ ముందుగా సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేటలోని మల్టీఫర్పస్ పంక్షన్‌హాల్ ఉదయం 8.30 గంటలకు, 9.30గంటలకు అమీర్‌పేట వివేకానంద కమ్యూనిటీహాల్, 10.30 గంటలకు అంబర్‌పేట మహారా ణా ప్రతాప్ పంక్షన్‌హాల్, 11.30గంటలకు గోషామహల్ నియోజకవర్గ పరిధిలో అబిడ్స్ పంక్షన్‌హాల్‌లో మంత్రి బతుకమ్మ చీరలను లబ్దిదారులకు పంపిణీ చేస్తారు.

జీహెచ్‌ఎం సీ పరిధిలో 15.40లక్షల చీరలను 18 సంవత్సరాలు నిండి తెల్లరేషన్‌కార్డు కలిగిన మహిళలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 30వ తేదీ వరకు చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు చేశారు. నగర మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్ని చీరలను పంపిణీ చేయనున్నారు.

Distribution of Batukamma sarees from today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: