కాదేదీ కుండీలకనర్హం!

  సృష్టిలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు. కాస్త సృజనాత్మకత ఉండాలే గానీ ప్రతి వస్తువునీ అనేక విధాలుగా మార్చుకుని వాడుకోవచ్చు. అలాంటి వినూత్న ఆలోచనలకు ప్రతిరూపాలే ఈ పూలకుండీలు. మొక్కల్ని పెంచడానికి పనికి రానిది ఏదీ లేదంటున్నారు ఉదానవన ప్రియులు. ప్లాస్టిక్, గాజు సీసాలు, డబ్బాలు, కార్ల టైర్లు, వాడేసిన జీన్స్, కొబ్బరిబోండాలు, పర్సులు, హ్యేండ్ బ్యాగులు, సోఫాలు, సంచులు ..ఇలా ప్రతిదీ కుండీలుగా మార్చుకుని మొక్కలు పెంచుకోవచ్చని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. చేసి చూపిస్తున్నారు […] The post కాదేదీ కుండీలకనర్హం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సృష్టిలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు. కాస్త సృజనాత్మకత ఉండాలే గానీ ప్రతి వస్తువునీ అనేక విధాలుగా మార్చుకుని వాడుకోవచ్చు. అలాంటి వినూత్న ఆలోచనలకు ప్రతిరూపాలే ఈ పూలకుండీలు. మొక్కల్ని పెంచడానికి పనికి రానిది ఏదీ లేదంటున్నారు ఉదానవన ప్రియులు. ప్లాస్టిక్, గాజు సీసాలు, డబ్బాలు, కార్ల టైర్లు, వాడేసిన జీన్స్, కొబ్బరిబోండాలు, పర్సులు, హ్యేండ్ బ్యాగులు, సోఫాలు, సంచులు ..ఇలా ప్రతిదీ కుండీలుగా మార్చుకుని మొక్కలు పెంచుకోవచ్చని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. చేసి చూపిస్తున్నారు కూడా.

టీ కప్పుల్లోనూ పుదీనా, కొత్తిమీర గింజలు చల్లి వంటింటి కిటికీలోనో, బాల్కనీలోనో కాస్త ఎండ తగిలే చోట ఉంచితే తాజా ఔషధ రుచులన్నీ సొంతం చేసుకోవచ్చు. పాడైపోయిన లెదర్ సోఫాల్లో మట్టిని నింపి వాటిల్లో రంగు రంగుల పూల మొక్కల్ని పెంచితే తోట అందమే మారిపోతుంది. కొబ్బరిచిప్పల్లో చిన్న చిన్న క్రోటన్ మొక్కలు వేసి ఓ కర్రకు వేలాడదీస్తే అందమైన కుండీల స్టాండ్ ఇంటికి మరింత అందాన్నిస్తుంది. అలాగే పాడైన జీన్స్ ప్యాంట్లు, చెప్పులనూ కుండీలుగా మార్చుకోవచ్చు. ఇవి ఎండకు ఎండి, వానకు తడిసిపాడైనా నేలలో కలిసిపోతాయి. కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హానీ జరగదు.

Handmade Flower vase with waste material

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాదేదీ కుండీలకనర్హం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: