స్కూలు భవనం కూలి 7గురు పిల్లల మృతి

నైరోబీ: కెన్యాలో స్కూల్ భవనం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు పిల్లలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. దేశ రాజధాని నైరోబీలో నాసిరకం నిర్మాణపు స్కూల్ కూలిన విషయాన్ని అధికారులు తెలియచేశారు. ఏడుగురు పిల్లలు మృతి చెందినట్లు నిర్థారించారు. 57 మంది బడిపిల్లలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. పేదలు ఎక్కువగా నివాసముండే డగోరెట్టి ప్రాంతంలోని ప్రజలు తమ పిల్లలు గాయపడ్డారని తెలియగానే ఉరుకులు పరుగులపై అక్కడికి చేరుకున్నారు. అధికారులపై తిట్లతో విరుచుకుపడ్డారు. స్కూల్ శిథిలాలను తొలిగిస్తున్నారు. […] The post స్కూలు భవనం కూలి 7గురు పిల్లల మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నైరోబీ: కెన్యాలో స్కూల్ భవనం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు పిల్లలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. దేశ రాజధాని నైరోబీలో నాసిరకం నిర్మాణపు స్కూల్ కూలిన విషయాన్ని అధికారులు తెలియచేశారు. ఏడుగురు పిల్లలు మృతి చెందినట్లు నిర్థారించారు. 57 మంది బడిపిల్లలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. పేదలు ఎక్కువగా నివాసముండే డగోరెట్టి ప్రాంతంలోని ప్రజలు తమ పిల్లలు గాయపడ్డారని తెలియగానే ఉరుకులు పరుగులపై అక్కడికి చేరుకున్నారు. అధికారులపై తిట్లతో విరుచుకుపడ్డారు. స్కూల్ శిథిలాలను తొలిగిస్తున్నారు. వీటి కింద చిన్నారులు ఎవరైనా పడి ఉన్నారా? అనేది తెలుసుకునేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

Seven dead in school collapse incident in Kenya

The post స్కూలు భవనం కూలి 7గురు పిల్లల మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.