మీర్‌పేట్ మెట్రో ఘటనపై కెటిఆర్ విచారం

హైదరాబాద్: అమీర్‌పేటలో మెట్రోపిల్లర్ పైనుంచి పెచ్చులు ఊడి పడి మహిళ మృతిచెందిన ఘటనపై మంత్రి కెటిఆర్ సీరియస్ అయ్యారు. ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ జరిపించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణాలు, వసతులను పరిశీలించాలని ఆయన మెట్రో అధికారులకు సూచించారు. ప్రయాణికుల భద్రతకు మెట్రో స్టేషన్లలో పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలని, అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. అనుకోని […] The post మీర్‌పేట్ మెట్రో ఘటనపై కెటిఆర్ విచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: అమీర్‌పేటలో మెట్రోపిల్లర్ పైనుంచి పెచ్చులు ఊడి పడి మహిళ మృతిచెందిన ఘటనపై మంత్రి కెటిఆర్ సీరియస్ అయ్యారు. ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ జరిపించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని మెట్రో స్టేషన్ల నిర్మాణాలు, వసతులను పరిశీలించాలని ఆయన మెట్రో అధికారులకు సూచించారు.

ప్రయాణికుల భద్రతకు మెట్రో స్టేషన్లలో పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలని, అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. అనుకోని ప్రమాదమే అయినప్పటికీ, దీనిని తీవ్రంగా పరిగణిం చాల్సిన అంశమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. నాణ్యత, భద్రతా అంశాల్లో హైదరాబాద్ సాధించిన ఖ్యాతిని ‘మెట్రో’ కొనసాగించాలని కెటిఆర్ సూచించారు. కాగా,  మౌనిక కుటుంబ సభ్యులకు రూ. 20 లక్షల పరిహారంతో పాటుగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు కూడా ఎల్ ఎండ్ టి సుముఖత వ్యక్తం చేసినట్టు మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Minister KTR Serious on Ameerpet Metro Incident

The post మీర్‌పేట్ మెట్రో ఘటనపై కెటిఆర్ విచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.