మహిళపై అత్యాచారం, హత్య…నిందితుడి అరెస్టు

  హైదరాబాద్: మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రక్తపు మరకలు ఉన్న షర్ట్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నల్గొండ జిల్లా, చందంపేట మండలం, పోల్‌యనాయక్ తండాకు చెందిన రమావత్ శుక్రు నాయక్ ఫంక్షన్ హాల్స్‌లో కూలీ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో పనికోసం నగరంలోని ఫంక్షన్ హాల్స్‌కు తరచూ వచ్చేవాడు. నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, […] The post మహిళపై అత్యాచారం, హత్య… నిందితుడి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడిని ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రక్తపు మరకలు ఉన్న షర్ట్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నల్గొండ జిల్లా, చందంపేట మండలం, పోల్‌యనాయక్ తండాకు చెందిన రమావత్ శుక్రు నాయక్ ఫంక్షన్ హాల్స్‌లో కూలీ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో పనికోసం నగరంలోని ఫంక్షన్ హాల్స్‌కు తరచూ వచ్చేవాడు. నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, ఉమ్మంతలపల్లికి చెందిన ముదిగొండ అంజనమ్మ తన చెల్లి కూతురు అర్పుల ముత్యాలు సైదాబాద్, చింతల్ వద్ద ఉంటోంది.

భర్తతో గొడవలు ఉండడంతో ఇక్కడ ఉండి సైదాబాద్, చంపాపేట్‌లోని ఫంక్షన్ హాల్స్‌లో పనిచేస్తోంది. ఈ నెల 11వతేదీన 7గంటలకు ఇంటి నుంచి వెళ్లిన ముదిగొండ అంజనమ్మ తిరిగి రాలేదు. మద్యం షాపు వద్ద అంజనమ్మ, శుక్రూ నాయక్ కలుసుకున్నారు. ఇద్దరు కలిసిన తర్వాత మద్యం తాగుదామని చంపాపేట్‌లోని రాఘవేంద్ర వైన్ షాపు వద్ద మద్యం కోనుగోలు చేశారు. తాగేందుకు సమీపంలోని బిఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్, వినయ్ నగర్, సైదాబాద్‌లోని ఓపెన్ ప్లేస్‌కు రాత్రి 10గంటలకు వెళ్లారు. ఇద్దరు కలిసి మద్యం తాగిన తర్వాత తన లైంగిక వాంఛ తీర్చాలని అంజనమ్మను శుక్రూ నాయక్ బలవంతం చేశాడు.

తనకు రూ.500 ఇస్తేనే ఒప్పకుంటానని చెప్పడంతో బలవంతంగా అత్యచారం చేశాడు. దీంతో బాధితురాలు నిందితుడిని దూషించడమే కాకుండా ఏడ్వడంతోపాటు మొబైల్ ఫోన్‌ను కిందపడేసింది. తర్వాత ఈ విషయం ఎవరికైన చెబుతుందనే భయంతో రాళ్లతో కొట్టి చంపివేశాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అంజనమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు వెంటనే సంఘటన స్థలం నుంచి సొంత గ్రామానికి పారిపోయాడు. సోమవారం చంపాపేటలో పనికోసం రాగా పోలీసులు అరెస్టు చేశారు.

స్థానికుల సమాచారంతో….
గుర్తు తెలియని మహిళ హత్యకు గురైందనే సమాచారం రావడంతో ఈ నెల 13వ తేదీన అంజనమ్మ అల్లుడు వెళ్లి చూడగా హత్యకు గురై ఉంది. తను తన భార్య పెద్దమ్మ అని చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఆ పరిసరాల్లోని దాదాపు 300 సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు చివరికి నిందితుడు రమావత్ శుక్రు నాయక్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. జాయింట్ కమిషనర్ రమేష్, ఈస్ట్ జోన్ ఇన్‌చార్జ్ డిసిపి చైతన్య కుమార్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, డిఐ సురేష్, ఎస్సైలు రమేష్, గోవిందు స్వామి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, కానిస్టేబుల్‌ను పట్టుకున్నారు.

Man arrested for rape and murder on woman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహిళపై అత్యాచారం, హత్య… నిందితుడి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.