పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య

  అమరావతి: కర్నూల్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన నలుగురు పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగి మృతి చెందిన ఘటన డోన్ తారకరామా నగర్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… జిల్లాలోని డోన్ తారకరామా నగర్ లో వర లక్ష్మి అనే మహిళ భర్త ఈరన్న, తన నలుగురు పిల్లలు పెద్దపాప ఇందు, రెండవ పాప ఉమాదేవి, కుమారుడు ఉదయ్ కుమార్, చిన్న కూతురు ఐశ్వర్యలతో కలిసి నివాసం […] The post పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: కర్నూల్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన నలుగురు పిల్లలకు విషమిచ్చి తాను కూడా తాగి మృతి చెందిన ఘటన డోన్ తారకరామా నగర్ లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… జిల్లాలోని డోన్ తారకరామా నగర్ లో వర లక్ష్మి అనే మహిళ భర్త ఈరన్న, తన నలుగురు పిల్లలు పెద్దపాప ఇందు, రెండవ పాప ఉమాదేవి, కుమారుడు ఉదయ్ కుమార్, చిన్న కూతురు ఐశ్వర్యలతో కలిసి నివాసం ఉంటుంది. కుటుంబ తగాదాల కారణంగా మహిళ తన నలుగురు పిల్లలకు  టీలో పురుగుల మందు కలిపి తాగించి, తాను తాగి ఆత్యహత్యకు పాల్పడింది. దీంతో పిల్లలు పురుగుల మందు తాగడం ఇష్టం లేక కేకలు వేశారు. ఆ కేకలకు చుట్టపక్కల వారు వచ్చి బాధితులను వెంటనే స్థానిక దవాఖానకు తరలించారు.  చికిత్స పొందుతూ వర లక్ష్మి మృతి చెందింది. పిల్లలకు ఎటువంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దవాఖానకు చేరుకొని ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతురాలి భర్తను అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నారు.

Mother Committed Suicide With Four Children in Kurnool

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: