హుజుర్ నగర్ లో విజయం మాదే : కెటిఆర్

నల్లగొండ : హుజుర్ నగర్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ ఉపఎన్నికలతో హుజుర్ నగర్ నుంచి కాంగ్రెస్ ను తరిమికొడుతామని ఆయన స్పష్టం చేశారు. సైదిరెడ్డికి విజయం చేకూర్చేందుకు టిఆర్ఎస్ […] The post హుజుర్ నగర్ లో విజయం మాదే : కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ : హుజుర్ నగర్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సైదిరెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ ఉపఎన్నికలతో హుజుర్ నగర్ నుంచి కాంగ్రెస్ ను తరిమికొడుతామని ఆయన స్పష్టం చేశారు. సైదిరెడ్డికి విజయం చేకూర్చేందుకు టిఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్యకు కాంగ్రెస్ మాత్రమే కారణమని, అటువంటి పార్టీని ప్రజలు నిలదీసి, అడ్రస్సు లేకుండా చేయాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపిలు గెలిచినా ప్రజలకు ఒరగబెట్టేదేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించేలా కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన సైదిరెడ్డికి టిఆర్ఎస్ భీపారం అందజేసి అభినందనలు తెలిపారు.

KTR Comments On Huzurnagar By Elections

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హుజుర్ నగర్ లో విజయం మాదే : కెటిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.