మౌనిక కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం

హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద నిలబడి ఉండగా కాంక్రీట్ శ్లాబ్ పెచ్చులూడి పడడంతో ఆదివారం ప్రాణాలు కోల్పోయిన మౌనిక అనే 26 ఏళ్ల మహిళ కుటుంబానికి రూ.20 లక్షల నష్ట పరిహారాన్ని ఎల్ అండ్ టి ప్రకటించింది. అంతేగాక ఆ మహిళ కుటుంబ సభ్యులలో ఒకరికి తమ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని కూడా ఎల్ అండ్ టి హామీ ఇచ్చింది. కాగా, ఎల్ అండ్ టి నుంచి రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని డిమాండు చేస్తూ […] The post మౌనిక కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద నిలబడి ఉండగా కాంక్రీట్ శ్లాబ్ పెచ్చులూడి పడడంతో ఆదివారం ప్రాణాలు కోల్పోయిన మౌనిక అనే 26 ఏళ్ల మహిళ కుటుంబానికి రూ.20 లక్షల నష్ట పరిహారాన్ని ఎల్ అండ్ టి ప్రకటించింది. అంతేగాక ఆ మహిళ కుటుంబ సభ్యులలో ఒకరికి తమ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని కూడా ఎల్ అండ్ టి హామీ ఇచ్చింది. కాగా, ఎల్ అండ్ టి నుంచి రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని డిమాండు చేస్తూ మౌనిక కుటుంబ సభ్యులు సోమవారం గాంధీ ఆస్పత్రి వద్ద ధర్నా చేశారు. అయితే అంత మొత్తాన్ని ఇవ్వలేమని చెప్పిన ఎల్ అండ్ టి రూ.20 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా నెలరోజుల్లోగా రూ.20 లక్షల పరిహారాన్ని అందచేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Ameerpet metro mishap, L&T announces 20 lakhs and Job to Mounikas family

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మౌనిక కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.