నీట్‌లో పాసైంది ఒకడు…తెల్ల కోటులో మరొకడు!

చెన్నై: తమిళనాడులోని తేనీ మెడికల్ కాలేజ్‌లో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి బదులుగా మరో యువకుడు క్లాసులకు హాజరవుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థుల సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఇ) ఆదేశించింది. ఎవరైనా విద్యార్థులు సెలవులో ఉంటే వారు కూడా తమ సర్టిఫికెట్ల పరిశీలనకు రావలసి ఉంటుందని డిఎంఇ ఆదేశించింది. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ఒక విద్యార్థికి తేనీ మెడికల్ […] The post నీట్‌లో పాసైంది ఒకడు… తెల్ల కోటులో మరొకడు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నై: తమిళనాడులోని తేనీ మెడికల్ కాలేజ్‌లో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి బదులుగా మరో యువకుడు క్లాసులకు హాజరవుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థుల సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఇ) ఆదేశించింది. ఎవరైనా విద్యార్థులు సెలవులో ఉంటే వారు కూడా తమ సర్టిఫికెట్ల పరిశీలనకు రావలసి ఉంటుందని డిఎంఇ ఆదేశించింది. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ఒక విద్యార్థికి తేనీ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. అయితే 20 రోజుల పాటు కాలేజీకి వచ్చిన ఆ మొదటి సంవత్సరం విద్యార్థికి బదులుగా మరో వ్యక్తి తరగతులకు హాజరు కాసాగాడు. ఈ విషయం ఆ మెడికల్ కాలేజ్ డీన్‌కు ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ విద్యార్థి దరఖాస్తును పరిశీలించిన కళాశాల అధికారులకు అందులోని ఫోటోకు, తరగతులు హాజరవుతున్న విద్యార్థి ముఖానికి తేడా కనిపించింది. దీనిపై డిఎంఇకి డీన్ నివేదిక పంపగా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాలు అందాయి. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు. అయితే చెన్నైలోని అసలు విదార్థి ఇంటికి పోలీసులు వెళ్లగా అక్కడ అతను కాని, అతని కుటుంబ సభ్యులు కాని ఎవరూ లేకపోవడం విశేషం.

TN medical colleges crack down on student identities, The DME order comes after impersonator had been attending classes on behalf of a first-year medical student

The post నీట్‌లో పాసైంది ఒకడు… తెల్ల కోటులో మరొకడు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: