అయోధ్యలో రాముడికి బంగారు గుడి కడతాం

    న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై వచ్చే నవంబర్‌లో హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడిన వెంటనే అయోధ్యలో రామాలయాన్ని బంగారంతో కడతామని హిందూ మహా సభకు చెందిన స్వామి చక్రపాణి వెల్లడించారు. అయోధ్యలో రామమందిరాన్ని ఇటుకలు, రాళ్లతో కాక బంగారంతో కడతామని సోమవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. భారతదేశంలోని సనాతన ధార్మిక హిందువులే కాక ప్రపంచంలోని హిందువులంతా రాముడికి బంగారు గుడిని కట్టేందుకు విరాళాలిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రామజన్మభూమి వివాదంపై […] The post అయోధ్యలో రాముడికి బంగారు గుడి కడతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై వచ్చే నవంబర్‌లో హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడిన వెంటనే అయోధ్యలో రామాలయాన్ని బంగారంతో కడతామని హిందూ మహా సభకు చెందిన స్వామి చక్రపాణి వెల్లడించారు. అయోధ్యలో రామమందిరాన్ని ఇటుకలు, రాళ్లతో కాక బంగారంతో కడతామని సోమవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. భారతదేశంలోని సనాతన ధార్మిక హిందువులే కాక ప్రపంచంలోని హిందువులంతా రాముడికి బంగారు గుడిని కట్టేందుకు విరాళాలిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రామజన్మభూమి వివాదంపై అక్టోబర్ 18లోగా వాదప్రతివాదనలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు గత వారం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం నవంబర్ మొదటివారంలో ఈ వివాదంపై తీర్పు వెలువడుతుందని సామి చక్రపాణి ఆశాభావంతో ఉన్నారు.

Hindu Maha Sabha to build Ram temple using gold
We have decided to build a grand temple of Lord Ram made not of stones and bricks but of Gold

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అయోధ్యలో రాముడికి బంగారు గుడి కడతాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: